నీవే శ్రావ్యసదనము

నీవే శ్రావ్యసదనము – నీదే శాంతివదనము | Hosanna ministries 2024  song Lyrics

నిత్యతేజుడా Album – 2024


నీవే శ్రావ్యసదనము
నీదే శాంతివదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా  ||నీవే ||

1. విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం (2)
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయశిఖరము చేరుటకు
నీ దక్షిణహస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే నా యేసయ్యా  ||నీవే ||

2. నీ నీతి నీరాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు  (2)
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా  ||నీవే ||

3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా  (2)
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా  ||నీవే ||

 


Neeve Shraavyasadanamu – Needey Shaantivadanamu | Hosanna ministries 2024 song Lyrics in English

Nityatejudaa Album – 2024

 

Neeve Shraavyasadanamu
Needey Shaantivadanamu
Nee Divi Sampada Nanne Cheragaa
Naa Prathi Prardhana Neeve Teerchagaa
Naa Prathi Spondane Ee Aaradhana
Naa Hrudayarpana Neeke Yesayya ||Neeve||

1. Virajimme Naapai Krupa Kiranam
Virabuse Parimalamai Krupa Kamalam (2)
Vishvaasayathralo Ontarinai
Vijayashikaramu Cherutaku
Nee Dakshinahastam Chaapitivi
Nannadukonutaaku Vachitivi
Nanu Balaparachi Nadipinche Naa Yesayya ||Neeve||

2. Nee Neeti Neerajyam Vedakitini
Nindaina Saubhaagyam Pondutaku (2)
Nalagi Virigina Hrudayamuto
Nee Vaakyamunu Sanmaninchitini
Shreyaskaramaina Deevenato
Shreshtha Phalamulanu Icchutaku
Nanu Preminchi Pilachitivi Naa Yesayya ||Neeve||

3. Parishuddhaatmakanu Nilayamuga
Upadeshamunu Vinayamuga (2)
Mahima Simhaasanamu Cherutaku
Vadhuvu Sanghamuga Marchumaya
Naa Pitarulaku Aashrayamai
Korina Revuku Cherpinchi
Nee Vaagdanam Neravechitivi Naa Yesayya ||Neeve||

స్తుతి పాడుటకే బ్రతికించిన

స్తుతి పాడుటకే బ్రతికించిన – జీవనదాతవు నీవేనయ్యా |Hosanna Ministries 2022 New Year special Song Lyrical


స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన
తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును
                                     ||స్తుతి పాడుటకే||
1. ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
                                     ||స్తుతి పాడుటకే||
2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
                                     ||స్తుతి పాడుటకే||
3. హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై
                                     ||స్తుతి పాడుటకే||

 


Stuti Paadutake Bratikinchina – Jeevanadaatavu Neevenayya |Hosanna Ministries 2022 New Year special Song Lyrical in English

 

Stuti Paadutake Bratikinchina
Jeevanadaatavu Neevenayya
Innaluga Nanu Poshinchina
Tallivale Nanu Oodaarchina
Nee Prema Naapai Ennadu Maaradu Yesayya (2)
Jeevitakaalamantaa Aadhaaram Neevenayya
Naa Jeevitakaalamantaa Aaradhinchi Ghanaparatunu
||Stuti Paadutake||

1. Praanabhayamunu Tolaginchinavu
Praakaaramulanu Sthaapinchinavu
Sarvajanulalo Nee Mahima Vivarimpa
Deerghaayuvuto Nanu Nimpinavu (2)
Nee Krupaa Baahulyame Veedani Anubandhamai
Talachina Pratikshanamuna Nootana Balamichchenu
||Stuti Paadutake||

2. Naapai Udayinche Nee Mahima Kiranalu
Kanumargaa Yenu Naa Duhkadinamulu
Krupalanupondi Nee Kaadi Moyutaku
Lokamulonundi Eraparachinavu (2)
Nee Divya Sankalpame—Avanilo Shubhapradamai
Nee Nitya Raajyamunakai Nireekshana Kaliginchenu
||Stuti Paadutake||

3. Hetuvulekaaye Preminchinavu
Vedukaga Ila Nanu Maarchinavu
Kalavaramondina Velaalayandu
Naa Cheyi Viduvaka Nadipinchinavu (2)
Nee Prema Maadhuryame Naa Nota Stutigaanamai
Nilichina Prati Sthalamuna Paarenu Selayerulai
||Stuti Paadutake||