కృపా క్షేమము నీ శాశ్వత జీవము

కృపా క్షేమము నీ శాశ్వత జీవము |Hosanna Ministries 2016 Song Lyrical

తేజోమయుడా Album – 2016

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను(2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

3. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

 


Krupa Kshemamu Nee Shaashvata Jeevamu |Hosanna Ministries 2022 Song Lyrical in English

Tejomayuda Album – 2016

 

Pallavi:
Krupa Kshemamu Nee Shaashvata Jeevamu
Naa Jeevita Kaalamanthayu Neevu Dayacheyuvadavu (2)
Mahonnatamainaa Nee Upakaaramulu
Talanuchu Anukshanamu Paravashinchanaa
Nee Krupalone Paravashinchanaa

Charanam 1:
Naa Prathi Prardhanaku Neevichhina Eevale
Lekkaku Minchina Deevenalainayi (2)
Adugulu Tadabadaka Nadipinadi Nee Divya Vaakyame
Kadalini Minchina Vishwasamunichchi Vijayamu Chekoorchenu (2)
Nee Vaakyame Makarandhamai Balaparichenu Nannu
Naa Yesayya Stuthipatruda Aaradhana Neeke (2)
Aaradhana Neeke ||Krupa Kshemamu||

Charanam 2:
Nee Sathya Maargamulo Phalinchina Anubhavame
Parimalimpa Cheshi Saakshiga Nilipayi (2)
Kalatacheynda Nilipinadi Nee Divya Darshaname
Gamyamu Chera Shaktitho Nanu Nimpi Noothana Krupanichenu (2)
Aaradhyuda Abhishiktuda Aaradhana Neeke
Naa Yesayya Stuthipatruda Aaradhana Neeke (2)
Aaradhana Neeke ||Krupa Kshemamu||

Charanam 3:
Naa Praana Priyuda Nannelu Maharaja
Naa Hrudi Nee Koraku Padilaparachithini (2)
Boorashabdhamu Vinaga Naa Brathukulo Kalalu Pandaga
Avadhululeni Aanandamutho Nee Kougili Ne Cheranaa (2)
Aaradhyuda Abhishiktuda Aaradhana Neeke
Praaneshwara Naa Yesayya Aaradhana Neeke (2)
Aaradhana Neeke ||Krupa Kshemamu||

ఆనందం నీలోనే

ఆనందం నీలోనే ఆధారం నీవేగా |Hosanna Ministries 2020 Song Lyrical

మనోహరుడా Album – 2020

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం||

1. పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం||

2. నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం||

3. సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||

 


Aanandam Neelone – Aadhaaram Neevegaa |Hosanna Ministries 2020 Song Lyrical in English

Manoharuda Album – 2020

 

Aanandam Neelone – Aadhaaram Neevegaa
Aashrayam Neelone – Naa Yesayyaa.. Sthothraarhudaa (2)
Arhathe Leni nannu – Preminchinaavu
Jeevinthu Ilalo – Nee Kosame.. Sakshyaardhamai ||Aanandam||

1. Pade Pade ninne Cheragaa
Prathikshanam Neeve Dhyaasagaa (2)
Kalavaraala Kotalo – Kanneeti Baatalo (2)
Kaapaade Kavachamgaa – Nannu Aavarinchina
Divya Kshethramaa – Sthothra Geethamaa ||Aanandam||

2. Nirantharam Neeve Velugani
Nithyamaina Swaasthyam Needani (2)
Nee Sannidhi Veedaka – Sannuthinchi Paadanaa (2)
Nee Korake Dhwajametthi Ninnu Prakatinchinaa
Sathya Vaakyame – Jeeva Vaakyame ||Aanandam||

3. Sarva Sathyame Naa Maargamai
Sangha Kshemame Naa Praanamai (2)
Loka Mahima Choodaka – Nee Jaadalu Veedaka (2)
Neethone Nilavaali Nithya Seeyonulo
Ee Darshanam – Naa Aashayam ||Aanandam||