నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి

స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి

1. శోభ కలిగిన – ఆ దివ్య నగరము

వర్ణింప శక్యము – కానిదియే -2

బహు సహస్రముల – సూర్యుని కంటె -2

ప్రజ్వలించుచున్నది – మహిమవలెను

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి

2. పరిపూర్ణమైన -సౌందర్యమును

పృథ్వికి – ఆనందముగాను -2

భూరాజులందరు – మహిమ తెచ్చెడి -2

మహిమగల నగరము – ఇదియే

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి

3. ధగధగ మెరయు – సూర్యకాంతం వలె

జ్వలించుచున్న- దైవనగరమందు -2

నీతిమంతులే – సూర్యునివలెను -2

నిత్య నిత్యముగా – ప్రకాశించుచుందురు

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి

స్వర్గమునందున్న- దేవుని యొద్ద నుండి

నూతన యెరుషలేమ్ – దిగి వచ్చుచున్నది

పెండ్లికుమార్తె వలె – మహిమతో నిండి

నను విడువక ఎడబాయక

నను విడువక ఎడబాయక
దాచితివా.. నీ చేతి నీడలో
(యేసయ్యా) నీ చేతి నీడలో (2)

సిలువలో చాపిన రెక్కల నీడలో (2)
సురక్షితముగా నన్ను దాచితివా (2)
కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి
ఆదరించిన యేసయ్యా (2)       ||నను||

ఉన్నత పిలుపుతో నన్ను పిలచి (2)
నీవున్న చోటున నేనుండుటకై (2)
పిలుపుకు తగిన మార్గము చూపి
నను స్థిరపరచిన యేసయ్యా (2)       ||నను||