నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా

నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా
ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా
నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా
నా యేసు రాజా రాజా – రాజా – రాజా…
రాజా రాజా యేసు రాజా
రాజా రాజా యేసు రాజా
రాజా యేసు రాజా (2)

నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము
నన్ను బంధించెనా (2)
నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2)      ||నా యేసు||

వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన
కనికర స్వరూపుడా (2)
నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2)      ||నా యేసు||

అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే
నా నీటి ఊట నీవే (2)
అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2)      ||నా యేసు||

నీ కృప బాహుళ్యమే

నీ కృప బాహుళ్యమే – నా జీవిత ఆధారమే -2
నీ కృపా -నీ కృపా -నీ కృపా -నీ కృపా -2 ॥ నీ కృపా ॥

1. శృతులు లేని – వీణనై మతి – తప్పినా వేళ -2
నీ కృప వీడక – నన్ను వెంబడించెనా -2 ॥ నీ కృపా ॥

2. శ్రమలలో – పుటమువేయ బడిన వేళ -2
నీ కృప నాలో – నిత్యజీవ మాయెనా -2 ॥ నీ కృపా ॥