నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము

నిత్యుడగు నా తండ్రి నీకే స్తోత్రము
తరతరముల నుండి ఉన్నవాడవు
ఆది అంతము లేని ఆత్మా రూపుడా
ఆత్మతో సత్యముతో అరాధింతును
నిత్యుడగు నా తండ్రి

1. భూమి ఆకాశములు గతించినా
మారనే మారని నా యేసయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా ॥ నిత్యుడగు ॥

2. సిలువలో నీవు కార్చిన రుధిరధారలే
నా పాపములకు పరిహారముగా మారెనులే
కొనియాడి పాడి నేను నాట్యం చేసెద ॥ నిత్యుడగు ॥

3. నూతన యెరూషలేముకై సిద్ధపదెదను
నూతన సృష్టిగ నేను మారెదను
నా తండ్రి యేసయ్యా ఆత్మదేవ స్తోత్రము ॥ నిత్యుడగు ॥

నేడో రేపో నా ప్రియుడేసు

నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో||

చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో||

కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)       ||నేడో రేపో||

నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే (2)               ||నేడో రేపో||