ప్రభువా – నీ సముఖము నందు

ప్రభువా – నీ సముఖము నందు

సంతోషము – కలదు

హల్లెలూయా సదా – పాడెదన్

హల్లెలూయా సదా – పాడెదన్

ప్రభువా – నీ సముఖము నందు

1. పాపపు ఊబిలో – నేనుండగా

ప్రేమతో – నన్నాకర్షించితిరే -2

కల్వారి రక్తంతో – శుద్ధి చేసి -2

రక్షించి పరిశుద్ధులతో – నిల్పి ॥ ప్రభువా ॥

2. సముద్ర – తరంగముల వలె

శోధనలెన్నో- ఎదురైనను -2

ఆదరణ కర్తచే – ఆదరించి -2

నీ నిత్య కృపలో – భద్రపరచి ॥ ప్రభువా ॥

3. సౌందర్య సీయోన్ని – తలంచగా

ఉప్పొంగుచున్న – హృదయముతో -2

ఆనందమానంద – మానందమాని -2

ప్రియునితో నేను పాడెదను ॥ ప్రభువా ॥

స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా

స్తుతికి పాత్రుడా – స్తోత్రార్హుడా

శుభప్రదమైన నిరీక్షణతో – శుభప్రదమైన నిరీక్షణతో

జయగీతమే పాడెద- అ – ఆ – ఆ

జయగీతమే పాడెద- అ – ఆ – ఆ

1. నా కృప నిన్ను విడువదంటివే -2

నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2

2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2

పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2

3. ఇహపరమందున నీవే నాకని -2

ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2