దేవా, నా దేవుడవు నీవే

దేవా, నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును|2|
నీ బలమును ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
||దేవా, నా దేవుడవు నీవే||

నీరు లేని దేశమందు దప్పిగొన్నది నా ప్రాణం |2|
నీ మీద ఆశ చేత సొమ్మసిల్లెను నా శరీరము |2|
||దేవా, నా దేవుడవు నీవే||

ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గానం
నీ రెక్కలు చాటున శరణన్నది నా ప్రాణం |2|
||దేవా, నా దేవుడవు నీవే||

హల్లెలూయా -యేసయ్యా

హల్లెలూయా -యేసయ్యా -2

మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2

1. యెహోషువా ప్రార్థించగా – సూర్య చంద్రులను నిలిపావు -3
దానియేలు ప్రార్థించగా – సింహపు నోళ్లను మూసావు -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2

హల్లెలూయా -యేసయ్యా -2

2. మోషే ప్రార్థించగా – మన్నాను కురిపించావు -3
ఏలియా ప్రార్థించగా – వర్షమును కురిపించితివి -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2

3. పౌలుసీలలు స్తుతించగా – చెరసాల పునాదులు కదిలించావు -3
ఇశ్రాయేలు స్తుతించగా – యెరికో గోడలు కూల్చావు -1
మహిమా ఘనతా నీకే యుగయుగముల వరకు -2
హల్లెలూయా -యేసయ్యా -2