యేసు అను నామమే – నా మధుర గానమే

యేసు అను నామమే – నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….

1. నా అడుగులు జార సిద్ధమాయెను -2

అంతలోన నా ప్రియుడు -2

నన్ను కౌగలించెను -1

యేసు అను నామమే – నా మధుర గానమే
నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….

2. అగాధజలములలోన – అలమటించు వేళ -2

జాలి వీడి విడువక -2

నన్ను ఆదరించెను -1

యేసు అను నామమే – నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే – యేసు అను నామమే….

3. అడవి చెట్లలోన – జల్దరు వృక్షంబు వలె -2

పురుషులలో నా ప్రియుడు -2

అధిక కాంక్షనీయుడు -1

యేసు అను నామమే – నా మధుర గానమే -2

నా హృదయ ధ్యానమే -1 యేసు అను నామమే….

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు

ఆశ్చర్యాకరుడా – నా ఆలోచన కర్తవు -2

నిత్యుడగు తండ్రివి – షాలేము రాజువు -2

1. సింహపు పిల్లలైనా – కొదువ కలిగి ఆకలిగోనినా -2

నీ పిల్లలు ఆకలితో – అలమటింతురా నీవున్నంతవరకు -2

॥ ఆశ్చర్యాకరుడా ॥

2. విత్తని పక్షులను – నిత్యము పోషించుచున్నావు -2

నీ పిల్లలు వాటికంటే – శ్రేష్టులే కదా నీవున్నంతవరకు -2

॥ ఆశ్చర్యాకరుడా ॥

3. చీకటి తొలగే – నీటి సూర్యుడు నాలో ఉదయించె -2

నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను నీవున్నంతవరకు -2

॥ ఆశ్చర్యాకరుడా ॥