తేజోవాసుల స్వాస్థ్యమందు

తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే

నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2

తేజోవాసుల స్వాస్థ్యమందు ……

1. అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2

శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥

2. రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం -2

కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥

3. శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము -2

శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥ తేజో ॥

4. నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం -2

అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా -2 ॥ తేజో ॥

నిత్యుడా – నీ సన్నిధి

నిత్యుడా – నీ సన్నిధి నిండుగా నా తోడూ
నిత్యముంచి నన్ను నడిపించుమా – నడిపించుమా -2

నీ కుడి హస్తం – హత్తుకొని యున్నది
నీ ఎడమ చేయి నా – తలక్రిందనున్నది -2
నీ కౌగిలిలోనే – నిత్యం నిలుపుమా -2                  ॥ నిత్యుడా ॥

నీ సన్నిధిలో – నా హృదయమును
నీళ్ళవలే – కుమ్మరించునట్లు -2
నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2              ॥ నిత్యుడా ॥

నీ సముఖములో – కాలుచున్న రాళ్ళవలె
నీ మనస్సు నందు – నన్ను తలంచితివా -2
నీ చిత్తమే నాలో – నేరవేర్చుమా -2                       ॥ నిత్యుడా ॥