kondala vaipu kannulu ettuchunnanu naa yesayya

kondala vaipu kannulu ettuchunnanu naa yesayya
పల్లవి:
కొండల వైపు కన్నులు ఎత్తుచున్నాను నా యేసయ్య
కొండ బండ సందుల్లోనే ఉండి మొరపెడుచున్నాను నా యేసయ్య (2)
నీవే నా ఆధారం, నీవే నా సర్వము (2)

చరణం 1:
కర్మేలు కొండపై ఎలీయా మొరపెట్టగా
ఆకాశమునుండి అగ్ని పంపిన నా యేసయ్య
నీవే నా ఆధారం, నీవే నా సర్వము (2)

చరణం 2:
హోరేబు కొండపై మోషే నీతో
మధుర సహవాసము చేయగా
పది ఆజ్ఞలు ఇచ్చిన నా యేసయ్య
నీవే నా ఆధారం, నీవే నా సర్వము (2)

చరణం 3:
గొల్గొతా కొండపై నా యేసయ్యా
“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు” అని మొరపెట్టగా
విన్న నా తండ్రి దేవా
నీవే నా ఆధారం, నీవే నా సర్వము (2)

ముగింపు:
ఈనాడు కూడా కొండల లోయలలో
నా మొర వింటున్న నా యేసయ్య
నీవే నా ఆధారం, నీవే నా సర్వము (2)

For more visit : https://newchristianprayerchurch.org/

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”