సంతోషమే సంతోషమే – సంతోషముతో స్తుతించెదన్

“చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది.” లూకా Luke 12:32

పల్లవి : సంతోషమే సంతోషమే – సంతోషముతో స్తుతించెదన్
క్రీస్తు యేసు రక్షించినన్ – చేర్చెను తన మందలో

1. ఘోర దుర్మార్గుడనై – దారితప్పి యుండగా
భూరి దయతో కాపరి యేసు – దారికి నడిపెను
|| సంతోషమే ||

2. అక్షయమైనదియు – నిర్మలమైనదియు
రక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చును
|| సంతోషమే ||

3. భయమేమి లేదికను – ప్రభు చిన్న మందకు
దయ కృపతో రాజ్యమివ్వ – తండ్రికిష్టమాయెన్
|| సంతోషమే ||

4. మంటి పురుగునకు – మింట రాజ్యమివ్వ
మింటనుండి మంటి కేతెంచి – మరణ మొందె నేసు
|| సంతోషమే ||

5. దేవా నీ తలంపులు – నాకు ప్రియమైనవి
శోధింప నెంతో అశక్యములు – అగమ్యములు
|| సంతోషమే ||

6. నిజకుమారుడేసున్ – మన కనుగ్రహించెను
రాజ్యముతో బాటు సమస్తము నివ్వ – వెనుదీయునా?
|| సంతోషమే ||

7. మహిమ రాజ్యమునకు – మిమ్మును పిలుచుచున్న
మహిమ రాజుకు తగినట్టుగా మీరు – నడుచుకొనుడి
|| సంతోషమే ||

8. రాజాధిరాజు యేసే – ప్రభుల ప్రభు యేసే
పరమందు దూతలు – యిహమందు నరులు హల్లెలూయ పాడుడి
|| సంతోషమే ||

అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై

“నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను.” యెషయా Isaiah 53:4

పల్లవి : అర్పింతు స్తుతుల్ నీ సిలువలోన జూపిన నీ ప్రేమకై
మరణమొంది సమాధి నుండి మరల లేచితివి

1. తలను ముండ్ల కిరీటము బొంది కాళ్ల చేతులు గ్రుచ్చబడి
బలియైతివి గొఱ్ఱెపిల్ల వలె నా కొరకే ఓ ప్రభువా
|| అర్పింతు ||

2. నీ చింతవలన నాకు శాంతి కల్గె నీ సిలువ వలన కిరీటం
నీ మరణమే నా జీవమాయె నీ ప్రేమ గొప్పదెంతో
|| అర్పింతు ||

3. నేను జూచెడి మహిమ స్వర్గము నావలన కలుగదు
ఆనంద బాష్పములతోనే స్తుతింతు ఈ ధనము నా కొరకే
|| అర్పింతు ||

4. నీ సిలువలో తొలగె నా నీచ పాపము నే ద్వేషింతు నన్నియున్
నీ సింహాసనము నాలోన యుంచుము నిన్ను నే స్తుతించెదను
|| అర్పింతు ||