ఇదిగో నీ రాజు వచ్చుచుండె

“నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.” జెకర్యా Zechariah 9:9

పల్లవి : ఇదిగో నీ రాజు వచ్చుచుండె
సీయోను కుమారి సంతోషించు
యేరూషలేం కుమారి ఉల్లసించు

1. నీదు రాజు నీతితో – దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు – వచ్చుచుండె
|| ఇదిగో ||

2. రక్షణ గలవాడుగా – అక్షయుండగు యేసుడు
దీక్షతోడ యెరూషలేం – వచ్చుచుండె
|| ఇదిగో ||

3. సాత్వీకుండు యీ భువిన్ – అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకై – వచ్చుచుండె
|| ఇదిగో ||

4. దీనపరుడు నీ ప్రభు – ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై – వచ్చుచుండె
|| ఇదిగో ||

5. ఇలను గాడిద నెక్కియే – బాలుర స్తోత్రములతో
బలుడగు నీ ప్రభు – వచ్చుచుండె
|| ఇదిగో ||

6. దావీదు కుమారుడు – దేవుడు పాపులకు
జయ గీతములతో – వచ్చుచుండె
|| ఇదిగో ||

7. యేసుని ప్రేమించుచు – హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె – హల్లెలూయా
|| ఇదిగో ||

ప్రియయేసు ప్రియయేసు

“నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు” పరమగీతము Song Of Songs 5:10

పల్లవి : ప్రియయేసు ప్రియయేసు
అతి ప్రియుడేసు పదివేలలో
ఆయనే నా దిక్కుగా కెవ్వరు?

1. ఇహమందు వేరేది పేరే లేదు
ఆయనే నా కొసగె ఆత్మానందం
నన్ను విమోచించి నా కొసగె విడుదల
ఆహా నా కందించె నిత్య ముక్తి
ǁ ప్రియయేసు ||

2. దైవపుత్రుండే నా ప్రియుడు యేసు
ప్రాయశ్చిత్తుడైన గొర్రెపిల్ల
యిహమున కరిగెను తన రక్తమిచ్చెను
కల్వరిపై ప్రాణమర్పించెను
|| ప్రియయేసు ||

3. సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్
విలువైన ప్రాణము అప్పగించెన్
నలుగ గొట్టబడి గాయముల నొంది
తిరిగి లేచెను నా ప్రియుడు యేసు
|| ప్రియయేసు ||