ఆశించుము ప్రభు – యేసు పాదములను

“… సాగిలపడి ఆయనను పూజించిరి” మత్తయి Matthew 2:11

పల్లవి : ఆశించుము ప్రభు – యేసు పాదములను
వాసిగ పాపుల – కాశ్రయములవి

1.యేసుని కీర్తిని కొనియాడెదము
యేసుని ప్రేమ చాటించెదము
యేసుని నామంబే మన జయము
ǁ ఆశించుము ||

2. యేసే ప్రేమ యేసే రక్షణ
యేసే జ్యోతి యేసే జీవం
యేసు ప్రభువునకే స్తుతియు మహిమ
|| ఆశించుము ||

3. సుజనుండేసుని భజనలు చేసి
నిరతంబాయన స్మరణము జేసి
ధన్యుండేసే యని పాడుమా
|| ఆశించుము ||

4. సార్వత్రికము తన సృష్టియే
తన వారికి కృపానిధియే
తన ప్రేమను మరువగ బోకు
|| ఆశించుము ||

5. యేసు పాదముల చేరి స్తుతించు
ఆత్మ ప్రాణ శరీ-రము నర్పించు
యేసుని నీదు ప్రభువుగా నెంచి
|| ఆశించుము ||

యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే

“సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక.” కీర్తన Psalm 150:6

పల్లవి : యెహోవా మహోన్నతుడా – మహిమయు నీదే
ఇహమందు రక్షకా – మహిమంచి దాతవు

1. పాలకుడవు పరమందు – ఏలికవు యెల్లరికి
చాలినట్టి ప్రధానుండా – సకల యధికారులకును
రాజుల రాజు ప్రభువుల ప్రభువు – ధరపర లోకములకు
దేవుడ వీవే ధన్యుండ నీకే ఘనమైన మహిమ
ǁ యెహోవా ||

2. పరమును విడచితివి – ధర కేతెంచితివి
ప్రాణమీవు బలిగానిచ్చి – మమ్మును రక్షించితివి
తిరిగి లేచి మాకు – కరుణ జీవమిచ్చితివి
విరివగు నీ ప్రేమ – నరులపై చూపితివి
ధర నీదే ఘనతయని – చరణముల పడుదుము
|| యెహోవా ||

3. సంఘమందు మహిమ నీకే – సకల యుగములకు
యుగమందు ప్రతిజీవి – యెహోవాయని యనున్
జగమంతటికి నీవు – నిజమైన ప్రభుడవు
ఆది యంతమై నీవు – అలరారుచున్నావు
యుగయుగములకు – ఘనమహిమ కలుగును
|| యెహోవా ||