సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలో

“ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి …” హెబ్రీయులకు Hebrews 1:4

పల్లవి : సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మలో
మన ప్రభుయేసుని ఆ….ఆ….ఆ….

1. మోషే కంటె శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్
వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదము
ǁ సాగిలపడి ||

2. అహరోను కంటె శ్రేష్ఠుడు – మన ఆరాధనకు పాత్రుండు
ఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము
|| సాగిలపడి ||

3. ఆలయముకన్న – శ్రేష్ఠుడు – నిజ ఆలయముగా తానే యుండెన్
ఆలయము మీరే యనెను – ఎల్లకాలము మ్రొక్కెదము
|| సాగిలపడి ||

4. యోనా కంటె శ్రేష్ఠుడు – ప్రాణ – దానముగా తన్ను అర్పించెన్
మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము
|| సాగిలపడి ||

5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు – సర్వజ్ఞానమునకు ఆధారుండు
పదివేలలో అతి ప్రియుండు – పదిలముగా మ్రొక్కెదము
|| సాగిలపడి ||

6. రాజుల కంటె శ్రేష్ఠుడు – యాజకులనుగా మనలను చేసెన్
రారాజుగ త్వరలో వచ్చున్ – రయముగను మ్రొక్కెదము
|| సాగిలపడి ||

7. అందరిలో అతి శ్రేష్ఠుడు – మనకందరికీ తానే ప్రభువు
హల్లెలూయకు పాత్రుండు – అనుదినము మ్రొక్కెదము
|| సాగిలపడి ||

ఆనందమానంద మాయెను

“ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి.” మత్తయి Matthew 17:5

పల్లవి : ఆనందమానంద మాయెను – నాదు
ప్రియకుమారుని యందు – మహాదానంద

అనుపల్లవి : నా తనయుని మాట వినండని
శబ్దమొక్కటి యా మేఘములో
ఉద్భవించె నద్భుతముగ

1. ప్రేమించుచున్నావు నీతిని – దుర్నీతిని ద్వేషించినావు – నీవు
అందుచే నీతోటి వారికంటె – ఆనంద తైలముతో తండ్రి నిన్ను
అధికంబుగ నభిషేకించెను
ǁమహానందమానంద మాయెను ||

2. అంత్య దినముల యందున – ఆ వింత కుమారుని ద్వరా – ఈ
మానవులతోడ మాట్లాడెను – సర్వంబునకు తండ్రి తనయుని
వారసునిగా నియమించెను
|| మహానందమానంద మాయెను ||

3. తనయుండె ఆ తండ్రి మహిమ – ఆ తత్వంపు రూపంబు తానే
మహాత్మ్యమైనట్టి మాటచేత – నమస్తమును నిర్వహించుచు
అందరిలో అతి శ్రేష్ఠుడాయె
|| మహానందమానంద మాయెను ||

4. నీవు నాదు కుమారుడవు – నిన్ను ప్రేమించి కన్నాను నేను – నేడు
దండిగ తనయుని ముద్దాడుడి – నిండుగాయన నాశ్రయించుడి
రండి రండి ధన్యులు కండి
|| మహానందమానంద మాయెను ||

5. విజ్ఞాన సంపద లెల్లను – ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను – ఆ
సంతోషమును పరిశుద్ధత – నమాధానము నీతి శక్తియు
విమోచన మాయెను యేసు
|| మహానందమానంద మాయెను ||

6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు – నీవు
నీ పెదవులమీద పోయబడి – నిండి యున్నది దయారసము
నిన్నాశీర్వదించెను తండ్రి
|| మహానందమానంద మాయెను ||

7. దివ్య రారాజై కుమారుడు – ఒక వెయ్యి వర్షాలు పాలించును – మహా
అంతము లేని రాజ్యమేలును – ఎందరు జయంబు నొందుదురో
అందరును పాలించెదరు
|| మహానందమానంద మాయెను ||