సంస్తుతింతుము నిన్నే – సౌలును విడచితివి

“నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుము.” 1 సమూయేలు Samuel 16:12

1. సంస్తుతింతుము నిన్నే – సౌలును విడచితివి
దావీదును కోరుకొని – దీవించిన యెహోవా

2. యెష్షయి పుత్రులలో – ఎర్రని వాడతడు
నేత్రాలు చక్కనివి – నేర్పరి మాటలలోన

3. రత్నవర్ణుడు యేసు – మాటలు దయగలవి
గువ్వలవలె వెలయు – కన్నులు గలవాడేసు

4. బెత్లెహేమునందు – ఖ్యాతిగా వాయించి
సొంపగు పాటలు పాడే – సుగుణాల సుందరుడు

5. పరమగీతము పాడే – పావనుడు మన యేసు
నేర్పరి మాటలలోన – నజరేతు నివాసి

6. వీరుడగు యౌవనుడు – శూరుడు యుద్ధమున
తల్లిని మించి యెహోవా – తనతోడై యున్నాడు

7. నేను కోరిన దితడే – వాని అన్నలముందు
అభిషేక తైలముతో – అభిషేకించుము వాని

8. సంఘవరుడగు క్రీస్తు – సత్యముగ మన శిరస్సు
ఆత్మాభిషిక్తుండై – అలరారుచున్నాడు

యేసు సమసిన సిల్వ చెంత

“యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక.” ప్రకటన Revelation 4:9

యేసు సమసిన సిల్వ చెంత – నే ప్రార్ధించిన స్థలమందు రక్తము
ద్వారా మన్నింపొందితిన్ – యేసుకు మహిమ

పల్లవి : యేసుకు మహిమ మహిమ (2)
నా యెద యిప్పుడు మారెను – యేసుకు మహిమ

1. ఆశ్చర్యముగా హృదయము మారెను – యేసుకు ఆలయమాయెను
సిల్వ యొద్ద నటులాయెను – యేసుకు మహిమ
|| యేసుకు ||

2. పాపము తీర్చు ప్రభావమది – నన్ను స్వస్థ పరచినది
యేసుచే నీ స్థితి కల్గెను – యేసుకు మహిమ
|| యేసుకు ||

3. ఈ జీవపు ఊట యొద్దకురా – హృదయము నిమ్ము యేసునకు
మున్గిన నీ పాపము పోవున్ – యేసుకు మహిమ
|| యేసుకు ||