యేసు పరిశుద్ధ నామమునకు

“సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక.” నెహెమ్యా Nehemiah 9:5

పల్లవి : యేసు పరిశుద్ధ నామమునకు
యెప్పుడు అధిక స్తోత్రమే

1. ఇహపరమున – మేలైన నామము
శక్తి గల్గినట్టి – నామమిది – పరి
శుధ్ధులు స్తుతించు నామమిది – పరి
|| యేసు ||

2. సైతానున్ పాతాళ – మును జయించిన
వీరత్వము గల నామమిది – జయ
మొందెదము యీ నామమున – జయ
|| యేసు ||

3. నశించు పాపుల రక్షించ లోక
మునకేతెంచిన – నామమిది – పర
లోకమున జేర్చు నామమిది – పర
|| యేసు ||

4. ఉత్తమ భక్తులు – పొగడి స్తుతించు
ఉన్నత దేవుని – నామమిది – లోక
మంత ప్రకాశించె – నామమిది – లోక
|| యేసు ||

5. శోధన గాధల – కష్టసమయాన
ఓదార్చి నడుపు – నామమిది – ఆటం
కము తీసివేయు నామమిది – ఆటం
|| యేసు ||

క్రీస్తు యేసు దయాళు ప్రభు – నీవే సృష్టికర్తవు

“ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.” 2 కొరింథీ Corinthians 8:9

పల్లవి : క్రీస్తు యేసు దయాళు ప్రభు – నీవే సృష్టికర్తవు
నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం

1. పాప జగాన – జన్మించితివి – పేద గృహాన – పెరిగితివి
సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి – ప్రియ యేసు
మమ్ము రక్షించితివి – మమ్ము
|| క్రీస్తు ||

2. జీవిత నావా – తుఫాను చేత – తల్లడిల్లగ – ఒక్క మాటతో
ఆజ్ఞాపించి తుఫాను నాపి – దరికి జేర్చితివి – ప్రియ యేసు
దరికి జేర్చితివి – దరికి
|| క్రీస్తు ||

3. ఎన్నో విధాల – పోనట్టి నాదు – పాప రోగము – నీ వస్త్రమును
ముట్టినంతనే – అద్భుతముగ – నివారణాయెను
ప్రియ యేసు నివారణాయెను – నివార
|| క్రీస్తు ||