నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు

“దేవునియందు భయభక్తులు గలవారలారా, మీరందరు వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించెదను” కీర్తన Psalm 66:16

1. నా ప్రియ యేసు నీవే నా శ్రేయంపు రాజవు
దయచే ప్రాయశ్చిత్తమైతివి నాదు రోజవు

2. సాతానుకు నే దాసుదనై నాశమొందగా
నాతాను ద్వారా తెలిపితివి నాదు ప్రియుడా

3. వ్యాదిగ్రస్తుండనై హృదయక్షీణ మొందితిన్
బాధల నొంది తప్పియుంటి నాదు ప్రియుడా

4. తప్పిన రూక, పిల్లవాడు, గొఱ్ఱెవలెనే
తప్పిన నన్ను వెదకి రక్షించితివి ప్రియుడా

5.తలిదండ్రులు విడిచినను నీవు విడువవు
చల్లగ ప్రక్కజేర్చి బ్రోతువీవు ప్రియుడా

6. నావాడవైతివి నేను నీదు వాడను
నాయాపదయందున్న ప్రభువు నాదు ప్రియుడా

7. ప్రభావముతో సాక్ష్యమీయ రాజ్యమేలుచు
ఆ భాగ్యమును చూడనిమ్ము నాదు ప్రియుడా

8. రక్షించితివి హల్లెలూయ పాడునట్లుగా
ఈ క్షితిలో నెల్లరకు చాట నాదు ప్రియుడా

కల్వరిలోని శ్రేష్ఠుడా – కరుణా భరిత సింహమా

నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.” 1 కొరింథీయులకు Corinthians 2:2

పల్లవి : కల్వరిలోని శ్రేష్ఠుడా – కరుణా భరిత సింహమా
కన్ను భ్రమించు ప్రభువా – సిలువలోని మిత్రుడా

1. స్తుతుకి పాత్రుండగువాడా – దూతలతో వెంచేయువాడా
సుదతి మరియ పుత్రుడా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

2. పాపులకై వచ్చినవాడా – ప్రేమ గల్గిన రక్షకుడా
పాదములపై బడితిమి – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

3. దీవెనల నిచ్చుటకై – వసుధ కేతించినవాడా
నీవే సుంకరు లాప్తుడవు – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

4. అయిదు రొట్టెలు మరి రెండు – చేపలతో నైదు వేల
జనుల పోషించిన తండ్రి – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

5. నీళ్ళను రసముగ మార్చితివి – నీళ్ళ మీద నడిచితివి
మేళ్ళ నొసగు మా దాతా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

6. రోగుల బాగుచేయువాడా – గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
అనాధుల నాయకుడా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||

7. హల్లెలూయా కర్హుడా – యెల్లరు కొనియాడు వాడా
బలముతో వచ్చువాడా – సిలువలోని మిత్రుడా
|| కల్వరి ||