ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా

“నీ సంవత్సరములకు అంతము లేదు.” కీర్తన Psalm 102:27

పల్లవి : ఆదియంతము లేనివాడా సంపూర్ణుడగు మా దేవా
నీతిజ్ఞానము కలవాడా జ్యోతికి నిలయము నీవే

1. అబ్రాహామును పిలిచితివి – ఆ వంశమున బుట్టితివి
అనాధులకు దిక్కు నీవే – అనాధుడవై వచ్చితివి
|| ఆదియంతము ||

2. ఇస్సాకును విడిపించి – యేసయ్యా బలియైనావా
యూదాచే నమ్మబడితివి – పాపులకై మరణించితివి
|| ఆదియంతము ||

3. యోనావలె మూడు దినముల్ – భూగర్భమున నీవుండి
మానవులను రక్షింప – మహిమతోడ లేచితివి
|| ఆదియంతము ||

4. పండ్రెండు గోత్రముల – జెంది – పండ్రెండు శిష్యుల జనకా
కన్యపుత్రుడవై సీయోను – కన్యను వరించితివి
|| ఆదియంతము ||

5. దావీదు కుమారుడవు – దావీదుకు దేవుడవు
కాపాడుచు నున్నావు – పాపిని నన్ను ప్రేమించి
|| ఆదియంతము ||

స్తుతించుడి స్తుతించుడి

“మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి.” కీర్తన Psalm 135:2

పల్లవి : స్తుతించుడి స్తుతించుడి
ఆయన మందిరపు ఆవరణములో
యెహోవా దేవుని స్తుతించుడి
భూమి ఆకాశమందున మీరెల్లరు కూడి స్తుతించుడి
రాజా రాజా ఓ రాజులకు రాజువంచు స్తుతించుడి

1. సర్వాధికారుడంచు – సర్వశక్తి మంతుడంచు
సంపూర్ణ ప్రేమరూపి – సాధుల శ్రీమంతుడంచు
సృష్టి నిన్ స్మరణ చేసెనో – ఓ … స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. పెళపెళ మ్రోగెడు ఉరుములలోన – రాజా రాజా
తళతళ మెరిసెడు మెరుపులలోన – రాజా రాజా
చననము గలిగిన జీవులలోన – రాజా రాజా
పలుకులు లేని ప్రకృతిలోన – రాజా రాజా
రాజాధి రాజుల రాజా – ఓ … స్తుతించుడి
|| స్తుతించుడి ||