ఆద్యంతరహితుడవగు మా జ్యోతి

నిత్యుడగు తండ్రి” యెషయా Isaiah 9:6

1. ఆద్యంతరహితుడవగు మా జ్యోతి
మేదిని ప్రభూ నిన్ స్తుతింతుము – మేదిని
నా దీన కాపరి నీతి కృపానిధి
శుధ్ధ దివ్యగత్రుడా

2. మనోహరమగు నీ కృప పొందను
మానవు లెల్లరము చేరితిమి – మానవు
ఆత్మరూపా కృపామయా నీ కరుణా
వరముల మాకీయుమా

3. పాలచే కడుగబడిన – ధవళాక్షుడా
వళ్లిపూలయందు తిరుగువాడా – వళ్లి
షాలేము రాజా షారోను రోజా
శాంత భూపతివి నీవే

4. లక్షల దూతల స్తుతుల నందువాడా
అక్షయ హేమమకుట ధారుడా – అక్షయ
హేమ కిరీటధారులమై స్వర్గంబు
చేర కడవరి వర్షమీ

5. క్రొత్త యెరూషలేం నగర రాజా
రత్నాల పునాది వేసితివి – రత్నాల
ధీరతతో నీ సాక్ష్యము చాటను
స్థిరమగునాత్మ నిమ్ము

6. శ్రేష్ఠురాలా పావురమా నిరుపమాన
ఇష్టంపురూప లావణ్యవతీ – ఇష్ట
అట్లంచు పిల్చు దివ్య ధ్వనికి మమ్ము
పాత్రులుగా చేయుమా

నీ రెక్కల చాటున శరనొందెదన్

పల్లవి: నీ రెక్కల చాటున శరనొందెదన్ – నా విశ్రమ గృహమైన ప్రభువా
మొట్ట పెట్టెదను ఉత్సహించెదను – మిగిలిన జీవిత కాలమంతయును

1. అలసితిని నే నావిధేయతతో – కృంగితి నేను పాపమూ చేతన్,
లేపితివినన్నుహత్తుకొంటివి – నీవు మోహన కాడి – నాకు విశ్రాంతి

2. గువ్వను పోలి ఎగిరి పొదును – నెమ్మది నొందెదనని తాలచితిని,
లేదు లేదు విశ్రాంతేచ్చట – నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్

3. చేసితివి మాతో వాగ్దానమును – నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్,
మానెదము మా ప్రయాశమును – పొందెదము క్రీస్తులో తిరిగి నే చేరితిన్

4. సిలువపై శ్రమలొందితివి – కార్చితివి నీ రక్తము మాకై,
లేచితివి నీవు మరణము గెల్చి – కూర్చుతివి నీ సంశుముగా మమ్ము

5. భంగపరచితి నీ విశ్రాంతిని – యోకోబుపంటి నా నడవడితో,
మార్పు నొందితి బేతేలు నందు – ఇక విశ్రమించుము నాలో ప్రభువా