స్తుతించుడి మీరు స్తుతించుడి

“సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 148

పల్లవి : స్తుతించుడి మీరు స్తుతించుడి
యెహోవా దేవుని స్తుతించుడి – స్తుతించుడి

1. ఓ దూతలారా పరమ సైన్యమా
సూర్యచంద్రులారా తారాగణమా ప్రభునే స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. పరమాకాశమా పైనున్న జలమా
సృష్టికర్తను స్తుతించుడి నాథుని స్తుతించుడి
|| స్తుతించుడి ||

3. మకరములారా అగాధ జలమా
అగ్ని వడగండ్లు ఆవిరి హిమమా కర్తను స్తుతించుడి
|| స్తుతించుడి ||

4. పర్వత శిఖర వృక్షములారా
మృగ పక్షి ప్రాకు పురుగులారా కాపరిని స్తుతించుడి
|| స్తుతించుడి ||

5. భూరాజులారా సర్వ ప్రజలారా
అధిపతులు యౌవనులు కన్యకలు రారాజుని స్తుతించుడి
|| స్తుతించుడి ||

6. మహోన్నతుండు ఇహ పరములలో
ఐశ్వర్యవంతుని స్తుతించుడి దేవుని స్తుతించుడి
|| స్తుతించుడి ||

7. ప్రజలెల్లరికి రక్షణ శృంగము
ఇశ్రాయేలీయులకు భక్తులకును తండ్రిని స్తుతించుడి
|| స్తుతించుడి ||

హల్లెలూయ యేసు ప్రభున్

“యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి.” కీర్తన Psalm 148, 150

1. హల్లెలూయ యేసు ప్రభున్ – యెల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను – తిలకించి స్తుతియించుడి
బలమైన పనిచేయు – బలవంతున్ స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు – యేసుని స్తుతియించుడి

పల్లవి : రాజుల రాజైన యేసు రాజు – భూజనులనేలున్
హల్లెలూయ హల్లెలూయ – దేవుని స్తుతియించుడి

2. తంబురతోను వీణతోను – ప్రభువును స్తుతియించుడి
పాపమును రక్తముతో – తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళములన్ – మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని – యేసుని స్తుతియించుడి
|| రాజుల రాజైన ||

3. సూర్య చంద్రులారా ఇల – దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన – యేసుని స్తుతియించుడి
అగ్ని వడగండ్లారా మీరు – కర్తను స్తుతియించుడి
హృదయమును ఒప్పించిన – నాథుని స్తుతియించుడి
|| రాజుల రాజైన ||

4. యువకులారా పిల్లలారా – దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభు పనికై – సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా – యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై – అర్పించి స్తుతియించుడి
|| రాజుల రాజైన ||

5. అగాధమైన జలములారా – దేవుని స్తుతియించుడి
అలల వలె సేవకులు – లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా – దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు – ఎల్లరు స్తుతియించుడి
|| రాజుల రాజైన ||