యెహోవా నీ యొక్క మాట చొప్పున

“నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను.” కీర్తన Psalm 119:65-72

పల్లవి : యెహోవా నీ యొక్క మాట చొప్పున
నీ దాసునికి మేలు చేసియున్నావు

1. మంచి వివేచన మంచి జ్ఞానమునకు – కర్త నీవే నాకు బోధ చేయుము
నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని
|| యెహోవా ||

2. నాకు శ్రమ కలుగక మునుపు – నా దేవా నేను త్రోవ వీడితిని
నేడు నీ మాట నెరవేర్చు చున్నాను
|| యెహోవా ||

3. దేవా నీవు దయగలవాడవు – దేవా నీవు మేలు చేయుచున్నావు
నీ కట్టడల నాకు బోధించుము
|| యెహోవా ||

4. గర్విష్ఠులు నాకు విరోధముగా – కల్పించుదురెన్నో అబద్ధములు
నీ యుపదేశము లనుసరింతును
|| యెహోవా ||

5. వారి హృదయములు క్రొవ్వువలె – చాల మందముగానై యున్నవి
.ఆజ్ఞలలో ఆనందించుచున్నాను
|| యెహోవా ||

6. దేవా నేను నీ కట్టడలను – నేర్చుకొనునట్లు శ్రమల నొంది
యుండుట నాకు యెంతో మేలాయెను
|| యెహోవా ||

7. వేలాది వెండి నాణెముల కంటె – వేలాది బంగారు నాణెముల కంటె
నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు
|| యెహోవా ||

స్తుతింతున్ దేవుని సభలో

“యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.” కీర్తన Psalm 111:1-5

పల్లవి : స్తుతింతున్ దేవుని సభలో
స్తుతింతున్ హల్లెలూయ

1. యథార్థవంతుల సంఘములో
హృదయపూర్తిగా స్తుతింతున్
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||

2. నీ క్రియలను దేవా ఆశించువారు
నీ యొద్ద విచారించెదరు
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||

3. దేవా నీ పనులు – ప్రభాము గలవి
నీ నీతి సదా నిలుచును
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||

4. యెహోవా అద్భుత కార్యములకు
జ్ఞాపక సూచన నుంచెను
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||

5. దయతో నిండిన దేవుడెహోవా
దాక్షిణ్య పూర్ణుడెహోవా
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||

6. భక్తి తనయందు గల్గిన వారికి
భోజనము నిచ్చి యున్నాడు
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||

7. యెహోవా చేసిన నిబంధనను
యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును
స్తుతింతున్ హల్లెలూయ
|| స్తుతింతున్ ||