దేవుడే మనకాశ్రయమును

పల్లవి : దేవుడే మనకాశ్రయమును
దుర్గమునై యున్నాడు – ఆపదలో

అనుపల్లవి : కావున భూమి – మార్పు నొందినను
కొండలు మున్గినను – ఆపదలో ఆపదలో

1. సముద్ర జలములు – ఘోషంచుచు – నురుగు కట్టినను
ఆ పొంగుకు పర్వతములు కదలినను – మనము – భయపడము
|| దేవుడే ||

2. ఒక నది కలదు – దాని కాలువలు – దేవుని పట్టణమును
సర్వోన్నతుని – మందిర పరిశుద్ధ స్థలమును – సంతోషపర్చు చున్నవి
|| దేవుడే ||

3. దేవుడా పట్టణములో – నున్నాడు దానికి – చలనము లేదు
అరుణో – దయమున దానికి సహాయము చేయుచున్నాడు
|| దేవుడే ||

4. జనములు ఘోషించు – చున్నవి రాజ్యములు కదలు చున్నవి
ఆయన కంఠధ్వని వినిపించగా – భూమి కరిగి పోవుచున్నది
|| దేవుడే ||

5. సైన్యములధిపతి – యెహోవా మనకు తోడైయున్నాడు
యాకోబు దేవుడు – మనకు ఆశ్రయమునై యున్నాడు
|| దేవుడే ||

6. యెహోవా చేసిన – కార్యములను వచ్చి చూడండి
అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే
|| దేవుడే ||

7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను
|| దేవుడే ||

కుమారి ఆలకించు – నీ వాలోచించి

పల్లవి : కుమారి ఆలకించు – నీ వాలోచించి
కుమారి చెవియొగ్గుము

అనుపల్లవి : మరువుము నీదు స్వంత జనమును
మరువుము నీదు తండ్రి యింటిని

1. ఈ రాజు నీ ప్రభువు – నీ సొగసు గోరె ఈ రాజు నీ ప్రభువు
ఈ రాజు నీదు సౌందర్యమును గోరె – ఈ రాజునకు నమస్కరించుము
|| కుమారి ||

2. తూరు దేశ కుమార్తె – నైవేద్యములను తీసికొని వచ్చును
ప్రజలలో ఇశ్వర్యవంతులు – కుమారి నీ దయను వెదకెదరు
|| కుమారి ||

3. అంతఃపురములో నుండు రాజకుమార్తె – ఎంతో మహిమ గలది
శృంగారమైనట్టి ఆమె వస్త్రములు – బంగారుబుట్టా పనిచేసినవి
|| కుమారి ||

4. విచిత్ర పనిగల వస్త్రముల ధరించి – విచిత్ర పనిగల
రాజు నొద్ధకు కన్యకల వలన – రమ్యముగా కొని రాబడుచున్నది
|| కుమారి ||

5. ఉత్సాహ సంతోషముతో – వారు వచ్చు చున్నారు – ఉత్సాహ సంతోషముతో
రాజనగరిలో ప్రవేశించు చున్నారు – రాబడు చున్నారు కన్యలందరు
|| కుమారి ||

6. నీ తండ్రులకు ప్రతిగా – నీ కుమారులుందురు – నీ తండ్రులకు ప్రతిగా
ఈ ధరణి యందంతట నీవు వారిని – అధికారులనుగా నియమించెదవు
|| కుమారి ||

7. తరము లన్నిటను నీ – పేరు జ్ఞాపకముండు – కరణి నొనర్చెదవు
కాన జనములు సర్వకాలము కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించెదరు
|| కుమారి ||