ఓ ప్రభువా యిది నీ కృపయే

“దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి … అపరాధములకు క్షమాపణ మనకు కలిగెను.” ఎఫెసీ Ephesians 1:7

పల్లవి : ఓ ప్రభువా యిది నీ కృపయే – గొప్ప క్రయము ద్వారా కలిగె

1. కృపద్వారానే పాపక్షమాపణ – రక్తము ద్వారానే కలిగె
అపరాధముల నుండి విమోచన – యేసులో మనకు ప్రాప్తించె
|| ఓ ప్రభువా ||

2. కృపద్వారానే కలిగిన రక్షణ – మానవులొసగ జాలరిల
క్రియలద్వారా కలుగలేదు – యేసు ప్రభుని వరమిదియే
|| ఓ ప్రభువా ||

3. కృపతో మనల పిలిచెను ప్రభువు – పరిశుద్ద పిలుపుద్వారా
అపరిమిత సంకల్పమువలన – మనమెరిగితిమి ఈ ధరలో
|| ఓ ప్రభువా ||

4. కృపద్వారానే నీతి మంతులుగా – తీర్చెను మనల ఉచితముగ
అపాత్రులమైయున్న మనకు – ప్రాయశ్చిత్తము కలిగెనుగ
|| ఓ ప్రభువా ||

5. కృపయే మనకు బయలు పడెను – సమస్తమును భోధించును
అపవిత్ర క్రియలన్నియు విడచి – భయభక్తులతో బ్రతికెదము
|| ఓ ప్రభువా ||

6. కృపద్వారానే బలవంతులమై – ఎదురుకొనెదము యుద్ధమును
ప్రభువునందు అంత మువరకు – స్థిరముగ ముందుకుసాగెదము
|| ఓ ప్రభువా ||

7. కృపద్వారానే సమీపించితిమి – దానియందే నిలిచితిమి
క్రీస్తు మహిమ నిరీక్షణకై – ఆయనకే స్తుతి పాడెదము
|| ఓ ప్రభువా ||

ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.” యోహాను John 3:16

పల్లవి : ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను రక్తము చిందించి
మా పాపము కడుగ సిలువపై అర్పించెను

1. త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను
మనలను తానే నిర్మించె గనుక మనలను ప్రేమించెను
|| ప్రేమ ||

2. శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను
తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల జేసెనుగా
|| ప్రేమ ||

3. తండ్రివలెనే ప్రేమజూపి నీచులనెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును
|| ప్రేమ ||

4. మా జీవితముల మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా
తన మహా ప్రేమ జూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను
|| ప్రేమ ||

5. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతము
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే
|| ప్రేమ ||

ప్రభువా నీదు ఘననామమున్ మేము

“ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు”  ఫిలిప్పీ Philippians 2:10

పల్లవి : ప్రభువా నీదు ఘననామమున్ మేము
పొగడిపాడ హృదయ ముప్పొంగెనే – యేసు
ప్రియుడా నీ పాద సన్నిధి చేర
నాలో నీదు ప్రేమ అధికంబాయనే

1. ఇహ పరము పొగడునట్టి ఘననామమే
ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే
శ్రమలన్ని బాపునట్టి ఘననామమే
భక్తులెల్ల వేళ పొగడిపాడు ఘననామమే
|| ప్రభువా ||

2. కీడునంత తొలగించు ఘననామమే
వెదకువారికెల్ల ఔషధమా ఘననామమే
సకల మేళ్ళనిచ్చునట్టి ఘననామమే
ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే
|| ప్రభువా ||

3. అపవాదిని తరిమినట్టి ఘననామమే
మమ్ము ప్రేమతోడ కౌగలించే ఘననామమే
పరిశుద్దులు పొగడునట్టి ఘననామమే
పరిశుద్దుల పరమున జేర్చు ఘననామమే
|| ప్రభువా ||

యేసూ నన్ ప్రేమించితివి – ఆశ్రయము లేనప్పుడు

“ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడెను” లూకా Luke 7:13

పల్లవి : యేసూ నన్ ప్రేమించితివి – ఆశ్రయము లేనప్పుడు
నీ శరణు వేడగానే – నా పాపభారము తొలగె

1. నే దూరమైతి నీకు – నశియించితి లోకమున
నేను గ్రహించలేదు – నీ హృదయ ప్రేమను
|| యేసూ ||

2. నే తలచలే దెప్పుడు – నా అంత మేమవునని
నా పాపములచే నేను – నిన్ను విసిగించితిని
|| యేసూ ||

3. నిన్ను నేగాంచగానే – నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి – నిన్నంగీకరించితి
|| యేసూ ||

4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు – రక్షకా తెచ్చితివి
|| యేసూ ||

5. పరిశుద్ధులలో చేర్చి – పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి – పరలోకము తెరచితివి
|| యేసూ ||

పావనుడా మా ప్రభువా

“అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండెను.” యెషయా Isaiah 6:1

పల్లవి : పావనుడా మా ప్రభువా – నీ రక్షణకై స్తోత్రములు
నీ రక్షణకై స్తోత్రములు

1. అత్యున్నతమైన దేవా – సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ – వర్ణింపజాలను నేను
|| పావనుడా ||

2. పాపపు కుష్ఠుతో పడి చెడిన – ఈపాపిని కరుణించితివి
నా పాపపు డాగులు కడిగి – పరిశుద్ధుని చేసిన విభుడా
|| పావనుడా ||

3. అపవిత్రమగు పెదవులతో – కపటముగా జీవించితిని
అపరాధి నోటిని తెరచి – స్తుతి గీతము నొసగిన ప్రభువా
|| పావనుడా ||

4. నీ క్రయధన మధికము ఎంతో – నా కర్త నిను ప్రణుతింతు
నా కందరి కంటె ఘనుడా – ఓ కల్వరి నాథా యేసు
|| పావనుడా ||

5. మహిమ పరతును ప్రభు యేసు – మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను – మహిమలో ఆరాధించెదను
|| పావనుడా ||

6. నా కనులతో నిను చూచెదను – ఆకసమున దూతల మధ్య
రక్షక త్వరగా రారమ్ము – అక్షయుడా నీకే స్తుతులు
|| పావనుడా ||