Jagati karudenche

Jagati karudenche – rakshana kartha
papula mora vinenu Yesu

1. Karunginavarini – ningiki yeththi paapamu shaapamu
aapadalanni bapenu Yesu

2. Paapapu paatranu – panamu jesi –
maranapu mullunu – virachi jayinchi
terache mokshadwaramun “Jaga”

3. Lendi randi – paduchu vega – chateda melleda – kotla prajalaku
premamayudesun “Jaga”

జగతి కరుదెంచె రక్షణకర్త
పాపుల మొర వినెను యేసు

1. కృంగినవారిని – నింగికి యెత్తి పాపము శాపము
ఆపదలన్ని బాపెను యేసు
|| జగతి ||

2. పాపపుపాత్రను పానము జేసి
మరణపు ముల్లును విరచి జయించి
తెరచె మోక్షద్వారమున్
|| జగతి ||

3. లెండి రండి పాడుచు వేగ
చాటెద మెల్లెడ కోట్ల ప్రజలకు
ప్రేమామయు డేసున్
|| జగతి ||

Jayamani padudi

Jayamani padudi sarwa janama mukthidaata yesunaku
sodara sodari pillalu peddalu
jayamani padudi yesunakau – jai

1. Siluvalo chindina rakthamuna paapa kshamaapana kaliginche

2. Yesu rakthamuna neethikalge agnisiksha tholagenu

3. Rakthaana aashcharya kriyajese papapu bandamu drunchenu

4. Rakta viluvache mukthi galge – prabhuni dasudanaitini

జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
సోదర సోదరి పిల్లలు పెద్దలు జయమని పాడుడి యేసునకు – జై

1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె
|| జయమని ||

2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను
|| జయమని ||

3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను
|| జయమని ||

4. రక్త విలువచే ముక్తి గల్గె – ప్రభుని దాసుడనైతిని
|| జయమని ||