దేవుని స్తుతియించుడి

దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||

ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

సన్న తంతుల సితారతోను (2)
చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

తంబురతోను నాట్యముతోను (2)
తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి

“యెహోవాను స్తుతించుడి. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి.” కీర్తన Psalm 149

పల్లవి : యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి
యెహోవాను స్తుతించుడి

అనుపల్లవి : భక్తులు కూడుకొను సమాజములో
స్తోత్రగీతము పాడుడి

1. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను
బట్టి సంతోషించెదరు గాక
సీయోను జనులు తమ రాజును బట్టి
ఆనందించుచు నుందురు గాక
|| యెహోవాకు ||

2. నాట్యముతో వారు తన నామమును
శ్రేష్ఠముగా స్తుతింతురు గాక
తంబురతోను సితారాతోను
తనివి తీర పాడుదురు గాక
|| యెహోవాకు ||

3. యెహోవా ఆయన ప్రజల యందు
మహా ప్రేమ కలిగినవాడు
ఆయన బీదలను రక్షణతో
అందముగ అలంకరించును
|| యెహోవాకు ||

4. భక్తులందరును ఘనతనొంది
నిత్యము ప్రహర్షింతురు గాక
సంతోషభరితులై పడకల మీద
వింత గానము చేతురు గాక
|| యెహోవాకు ||

యెహోవాకు స్తుతులు పాడండి

“యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక. వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహగానము చేయుదురు గాక.” కీర్తన Psalm 149

పల్లవి : యెహోవాకు స్తుతులు పాడండి – మీరు
సమాజములో ప్రభు ప్రశంస పాడి
సభలో పాడండి మీరు యెహోవాకు

1. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను
సీయోను వాసులు తమ రాజును
స్మరియించుకొని సంతోషింతురు
నాట్యమాడి తన స్తుతి పాడండి – మీరు
|| యెహోవాకు ||

2. తంబురతోను సితారాతోను
తనను గూర్చి గానము చేసి
దేవుని ప్రేమరసమును గ్రోలి
పావనాలంకారమును బొంది – మీరు
|| యెహోవాకు ||

3. భక్తులు ఘనులై హర్షింతురు
ఉత్సాహమున ఉప్పొంగెదరు
పడకల మీద ప్రభువును కోరి
పాడి పాడి ప్రభువును దలచెదరు – మీరు
|| యెహోవాకు ||

4. అన్యజనులను శిక్షించుటకు
రాజులఁ గొలుసుతో బంధించుటకు
రెండంచుల ఖడ్గమును ధరించిరి
దైవ భక్తులకు ఘనతయునిదే – మీరు
|| యెహోవాకు ||

స్తుతించుడి యెహోవా దేవుని

“యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాని నతిక్రమింపదు.” కీర్తన Psalm 148

పల్లవి : స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి

1.కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||

2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||

స్తుతియించుడాయన నాకాశవాసులారా

“యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతియించుదురు గాక! ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.” కీర్తన Psalm 148

1.స్తుతియించుడాయన నాకాశవాసులారా
స్తుతియించుడి ఉన్నతస్థలములలో

పల్లవి : స్తుతియించుడి శుద్ధుడెహోవాను స్తుతియించుడి

2. స్తుతియించుడి దూతలారా మీరందరు
స్తుతియించుడాయనన్ సైన్యములారా
|| స్తుతియించుడి ||

3. స్తుతియించుడి సూర్యచంద్రులారా మీరు
కాంతిగల నక్షత్రములారా
|| స్తుతియించుడి ||

4. స్తుతియించుడి పరమాకాశములారా
స్తుతియించుడి ఆకాశ జలములారా
|| స్తుతియించుడి ||

5. స్తుతియించుడి సమస్త మకరములారా
స్తుతియించుడి అగాధ జలములారా
|| స్తుతియించుడి ||

6. స్తుతియించుడగ్నియు వడగండ్లార
స్తుతియించుడాయన నావిరి హిమమా
|| స్తుతియించుడి ||

7. స్తుతియించు డాజ్ఞకు లోబడు తుఫాను
స్తుతియించుడి పర్వతములు గుట్టలారా
|| స్తుతియించుడి ||

8. స్తుతియించుడి సమస్త ఫల వృక్షములారా
స్తుతియించుడి దేవదారు వృక్షములారా
|| స్తుతియించుడి ||

9. స్తుతియించుడి మీరు కౄర మృగములారా
స్తుతియించుడి మీరు సాధు జంతువులారా
|| స్తుతియించుడి ||

10. స్తుతియించుడి నేల ప్రాకు జీవులారా
స్తుతియించుడి మీ రాకాశ పక్షులారా
|| స్తుతియించుడి ||

11. స్తుతియించుడాయనన్ భూరాజులారా
స్తుతియించుడి సమస్త జనంబులారా
|| స్తుతియించుడి ||