ఎంత జాలి యేసువా – యింతయని యూహించలేను

“తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.” కీర్తన Psalm 103:13

పల్లవి : ఎంత జాలి యేసువా – యింతయని యూహించలేను

1. హానికరుడ హింసకుడను – దేవదూషకుడను నేను
అవిశ్వాసినైన నన్ను – ఆదరించినావుగా
|| ఎంత ||

2. రక్షకుండా నాకు బదులు – శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి – చావొందితివి నాకై
|| ఎంత ||

3. ఏమి నీ కర్పించగలను – ఏమి లేని వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి – స్తొత్రమంచు పాడెద
|| ఎంత ||

4. నీదు నామమునకు యిలలో – భయపడెడు వారి కొరకై
నాథుడా నీ విచ్చు మేలు – ఎంత గొప్పదేసువా
|| ఎంత ||

5. నేను బ్రతుకు దినములన్ని – క్షేమమెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు – ఇచ్చు వాడా పభువా
|| ఎంత ||

6. నాదు ప్రాణమునకు ప్రభువా – సేద దీర్చు వాడ వీవు
నాదు కాపరివి నీవు – నాకు లేమి లేదుగా
|| ఎంత ||

7. అందరిలో అతి శ్రేష్ఠుండా – అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను – హర్షముతో పాడెద
|| ఎంత ||

యేసు నామం మనోహరం

“దాసుని రూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను” ఫిలిప్పీ Philippians 2:7

పల్లవి : యేసు నామం మనోహరం – ఎంతో అతిమధురం
పరమునందైన ఇహమునందైన వేరే నామమే లేదు

1. అమూల్య ప్రాణమిచ్చెన్ – పాపులను రక్షించుటకై
దాసుని రూపమొంది – ఇహమున దిగివచ్చెను
కీర్తింతును నీ నామం – ఘనపరతును – నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో – మమ్ము నాశీర్వాదింప
|| యేసు నామం ||

2. కల్వరిగిరిలో ఇనుపమేకులతో
ప్రభువా నీ దేహమును – సిలువపై నెక్కించిరి
కీర్తింతును నీ నామం – ఘనపరతును – నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో – మమ్ము నాశీర్వాదింప
|| యేసు నామం ||

3. పూర్ణ స్వస్థత మాకు – ప్రేమతో నొసగితివి
శాంతి ఆనందములు – నీ నామమున దొరుకున్
కీర్తింతును నీ నామం – ఘనపరతును – నీ నామం
ఓ మా ప్రభువా రమ్ము యీవులతో – మమ్ము నాశీర్వాదింప
|| యేసు నామం ||