స్తోత్రము పాడి పొగడెదను

“శ్రేష్ఠమైనది ప్రేమయే.” 1 కొరింథీ Corinthians 13:13

పల్లవి : స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను

1. అద్భుతమైన ప్రేమ – నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ
ఎన్నడును మారని ప్రేమ – నాలో నిలుచుండు ప్రేమ
|| స్తోత్రము ||

2. జ్యోతిగా జగమునకు – వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ
త్యాగియైన క్రీస్తు ప్రేమ – దివ్య మధుర ప్రేమ
|| స్తోత్రము ||

3. మాయలోక ప్రేమను – నమ్మి నశించిన నన్ను ప్రేమించెను
నన్ను జయించిన దైవ ప్రేమ – నాలో ఉప్పొంగు ప్రేమ
|| స్తోత్రము ||

4. ఆధారమైన ప్రేమ – దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ
ఉన్నత మహా దైవ ప్రేమ – నన్నాకర్షించె ప్రేమ
|| స్తోత్రము ||

5. మాట తప్పని ప్రేమ – పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ
సర్వ శక్తిగల దైవ ప్రేమ – సతతము నుండు ప్రేమ
|| స్తోత్రము ||

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

“క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?” రోమా Romans 8:35

పల్లవి : రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా

1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు?
దూతలైనను ప్రధానులైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
|| రక్షకుడా ||

2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను
కరువైనను ఖడ్గమైనను
|| రక్షకుడా ||

3. సర్వలోకరక్షణకై సిలువనెక్కెను
శ్రమయైనను బాధయైనను
|| రక్షకుడా ||

4. ఎంచలేని యేసునాకై హింసపొందెనే
హింసయైనను హీనతయైనను
|| రక్షకుడా ||

5. మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను
మరణమైనను జీవమైనను
|| రక్షకుడా ||

6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను
ఎత్తైనను లోతైనను
|| రక్షకుడా ||

7. ఎన్నడైన మారని మా యేసుడుండగా
ఉన్నవైనను రానున్నవైనను
ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
|| రక్షకుడా ||