Parama thandri sutudu

Parama thandri sutudu praanamichen – papi korakai

1. Vinumu sodara – vintavaartanu devadevude – tyagamayenu
a – devude dayato nannu vedaki vachega “Parama”

2. Calvari prabhun-ganchu sodaraa vreladenu – Yesu naduda
naa – papamul siluvalo mose nesu calvarin “Parama”

3. Dehamantayun – gaya mondene na rogamun bagu chesene
na sapamun bapenu mose nella badalan “Parama”

4. Mahin premache – mahima vidachane –
mata valane – mammu brochene
E – mahiyandu yennadun kaananatti kaaryame “Parama”

5. Yesu prabhukai – emi chetunu – deena manasuto sevajetunu
nan – niratamu gachunu yellavela kollagan “Parama”

పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే – పాపి కొరకై

1. వినుము సోదరా – వింతవార్తను దేవదేవుడే – త్యాగమాయెను
ఆ – దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా
|| పరమ ||

2. కల్వరి ప్రభున్ – గాంచు సోదరా వ్రేలాడెను – యేసునాథుడు
నా – పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్
|| పరమ ||

3. దేహమంతయున్ – గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్
|| పరమ ||

4. మహిన్ ప్రేమచే – మహిమ విడచెనే – మాత వలెనే – మమ్ము బ్రోచెనే
ఇ – మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే
|| పరమ ||

5. యేసు ప్రభుకై – ఏమి చేతును – దీన మనసుతో – సేవజేతును
నన్ – నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్
|| పరమ ||

Rajulaku rajaina

Rajulaku rajaina Yesu prabhuvu ranai yunnaadu (2)
eththabadedavaa leka viduvabadedavaa ? (2) “Raju”

1. Telisikontiva neeventha ghorapaapivo –
siluvapai theerchegaa nee paaparunamun (2)
oppukonina paapamun kshaminchunu Yesu
leni edala viduvabadedavu siddapadumaa “Raju”

2. Buddhileni kanyalavale mosapotivaa –
cheyalevu prabhu seva nee shakhtitho
nooneleka bramatho bratikedava –
leni yedala viduvabadedavu siddapaduma “Raju”

3. Vaakhyamukai jeevitam appagimpaka –
daachitivaa talaantulanu lekkacheyaka
modati premanu thirigi ponduma –
leni yedala nashtah poduvu siddapadumaa “Raju”

4. Praanamichchi vimochinchi nee premato –
krupanu batti nadipitivi naadu yaatralo
mugiyuvaraku siddaparachu nee rakakai
halleluya halleluya halleluya “Raju”

రాజులకు రాజైన యేసు ప్రభు రానై యున్నాడు (2)
ఎత్తబడెదవా లేక విడువబడెదవా? (2)
1. తెలిసికొంటివా నీవెంత ఘోరపాపివో
సిలువపై తీర్చెగా నీ పాప ఋణమున్
ఒప్పుకొనిన పాపమున్ క్షమించు యేసు
లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా
|| రాజులకు ||

2. బుద్ధిలేని కన్యకవలె మోసపోతివా
చేయలేవు ప్రభుసేవ నీ శక్తితో
నూనెలేక భ్రమతో బ్రతికెదవా
లేని యెడల విడువబడెదవు సిద్ధపడుమా
|| రాజులకు ||

3. వాక్యముకై జీవితం అప్పగింపక
దాచితివా తలాంతులను లెక్కచేయక
మొదటి ప్రేమను తిరిగి పొందుమా
లేని యెడల నష్టపోదువు సిద్ధపడుమా
|| రాజులకు ||

4. ప్రాణమిచ్చి విమోచించి నీ ప్రేమతో
కృపనుబట్టి నడిపితివి నాదు యాత్రలో
ముగియువరకు సిద్ధపరచు నీ రాకకై
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
|| రాజులకు ||