నా ప్రియమైన యేసుప్రభు

“ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” కీర్తన Psalm 103:2

పల్లవి : నా ప్రియమైన యేసుప్రభు – వేలాదిస్తోత్రములు
నీ విచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారముకై దేవా – స్తోత్రము స్తోత్రములు

1. ఆపద దినములలో – నా ప్రభుని తలచితిని
దేవా నీ దయతోడనే – నాథా – ఆశ్రయం పొందితివి
|| నా ప్రియమైన ||

2. ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం
నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై
|| నా ప్రియమైన ||

3. లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని
శుద్ధ హృదయ మిచ్చావు – దేవా – నిన్నునే దర్శించుటకై
|| నా ప్రియమైన ||

4. ఈ దినమునే పాడుట – నీ వలనే యేసుప్రభు
ఎల్లప్పుడు నే పాడెదన్ – దేవా – నాయందు వసియించుము
|| నా ప్రియమైన ||

5. మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును
నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి
|| నా ప్రియమైన ||

ఓ అబ్రాహాం, ఇస్సాకు – ఇశ్రాయేలు దేవా

“ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెను ― యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా …” 1 రాజులు Kings 18:36

పల్లవి : ఓ అబ్రాహాం, ఇస్సాకు – ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు (2)

1. ఏలోయి అదోనియా – త్రియేక దేవా
ప్రభుడవు – సృష్టి – కర్తవు నీవు (2)
ఎల్లరి అద్భుత – రక్షకుడవు (2)
|| ఓ అబ్రాహాం ||

2. యెహోవాదేవా – ప్రభువుల ప్రభువా
దర్శనమిచ్చు – దేవుడవు
ఉన్నవాడవు – నిత్యుడవు
|| ఓ అబ్రాహాం ||

3. ఎల్ షద్దాయి – ప్రభువా – సర్వశక్తిమంతుడా
సంపూర్ణ తృప్తినిచ్చు – ప్రభువు నీవే
సమృద్ధిని రక్షణను – యిచ్చు వాడవు
|| ఓ అబ్రాహాం ||

4. యెహోవా యీరే – చూచుకొనువాడవు
యెహోవా రోపె – స్వస్థ పరచువాడవు
యెహోవా నిస్సీ – విజయమిచ్చువాడవు
|| ఓ అబ్రాహాం ||

5. యెహోవా కాదేషు – శుద్ధి చేయువాడవు
యెహోవా షాలేము – శాంతి కర్తవు
యెహోవా సిద్కెను – మా నీతియు నీవే
|| ఓ అబ్రాహాం ||

6. యెహోవా రోహి – లోక సంరక్షకుడా
గొర్రెల నెన్నటికి – నెడబాయవు
వాటిని విడువక – నడి పెదవు
|| ఓ అబ్రాహాం ||

7. యెహోవా షమ్మా – ఇచ్చటున్న వాడవు
జీవింతువు ప్రభు – యుగ యుగముల్
సదా మమ్ము నీతోనే – నుంచెదవు
|| ఓ అబ్రాహాం ||