స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ

“ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను” యోహాను John 4:24

పల్లవి : స్తుతియూ, ప్రశంసయూ, మహిమయూ
నా ముక్తి దాతకే
ఆత్మసత్యముతో – ఆరాధించెదన్
హృదయపూర్వక – కృతజ్ఞతలన్
సదా సర్వదా చెల్లింతున్ – 2

1. కొనియాడెదన్ నీదు కల్వరి ప్రేమను
వర్ణించలేను నీ అపార ప్రేమను
ఘోరవేదన – సంకట శ్రమలన్
శపిత సిల్వపై క్రీస్తు సహించెను
తండ్రి చిత్తము నూ నెరవేర్చెను
|| స్తుతియూ ||

2. కీర్తించెదా నీదు అపారకరుణకై
పరమ పుత్రుండు వేదన నోర్చెను
అవమాన నిందలు – మోముపై ఉమ్మియూ
ప్రేమతో అన్నియూ సహించె మౌనమున్
అమూల్య ప్రాణమిచ్చె మానవాళికే (మనకొరకే)
|| స్తుతియూ ||

3. కృతజ్ఞత చెల్లించెద నీ బలిదానమునకై
అంతులేని నీ గొప్ప ప్రేమకై
అనంత జీవము మహిమ నిరీక్షణ
నా జీవితమునకే ఆధారమాయె
క్రీస్తుకే పాడెదన్ హల్లెలూయ
|| స్తుతియూ ||

మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు

“సర్వమును ఆయనయందు సృజింపబడెను” కొలొస్స Colossians 1:16

పల్లవి : మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు
ప్రేమపూర్ణుడా నిన్ను మనస్సార స్తుతించెదను

1. ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా మృతుడను
దాచబడితిని నీయందు స్థిరపరచితివి నన్ను
ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను
|| మహా సామర్థ్యా ||

2. సర్వశ్రేష్టుండా ప్రభువా సర్వ ప్రదానుండవు నీవే
నీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నాను
నీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను
|| మహా సామర్థ్యా ||

3. నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివి
వేగ వచ్చుచున్నావని నా ఆశ అధికంబగుచుండె
సంధింతు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతుల నర్పించి
|| మహా సామర్థ్యా ||

4. ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివి
సర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవి
నిన్నుబట్టి జయించెదను దీనుడనై భజించెదను
|| మహా సామర్థ్యా ||