ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్

“అప్పుడు మేఘము … మందిరమును నింపెను” నిర్గమ Exodus 40:34

పల్లవి : ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్

1. సార్వత్రిక సంఘ నగర విహారీ సర్వస్వానీ కాధారీ
పరిశుద్ధ మహాసభల ప్రధానీ భక్తస్తుతి హారాధారీ
|| ప్రభువైన ||

2. భక్తుండగు మోషే నీదు ఆనతిని నిర్మించె గుడారమున్
దానిన్ నీదు మహిమతో నింపి ధగధగ మెరిపించిన ప్రభో
|| ప్రభువైన ||

3. రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి రమ్యంబుగా శిష్యుల
హృదయ సుమముల్ విరియబూయన్ సదయా ప్రకాశించితివి
|| ప్రభువైన ||

4. దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ నెరవేర్చితివి పూర్తిగా
ధీరుడవై నీ ప్రాణం నొసగి తండ్రిని మహిమపరచితివి
|| ప్రభువైన ||

5. మంటి పురుగులమౌ మమ్ము రక్షించి మా నీతిమహిమ నీవై
మాలో నీవు మహిమరూప మహిమ పరచబడినావు
|| ప్రభువైన ||

6. మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ మాదు కృతజ్ఞతలు
మాప్రాణాత్మల్ మాదుతనువుల్ మాప్రభు నీస్వంతం నిరతం
|| ప్రభువైన ||

పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా

“మహిమ గల ఈ రాజు యెవడు? బలశౌర్యములు గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా” కీర్తన Psalm 24:8

పల్లవి : పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా
నిన్ను మేము పూజించెదము శ్రద్ధభక్తితో

1. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి
ధనవంతులుగ మమ్ము జేయ పేదవైతివి
|| పాడెదము ||

2. దేవుని స్వరూపమైయుండి యెంచలేదు సమానుడని
రిక్తుడై నిందను భరించి దాసుడైతివి
|| పాడెదము ||

3. పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగనైతివినిల
నీతి న్యాయములు గలిగి జయించితివి
|| పాడెదము ||

4. పాపమెరుగని వాడవు కపటమేమి లేదు నీ నోట
ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు
|| పాడెదము ||

5. నీచుడుగా నీ వెంచబడి తృణీకరింప బడితివి
వ్యాధి బాధ వేదన పొంది సహించితివి
|| పాడెదము ||

6. గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా
నలుగ గొట్టబడిన నీవు మరణమైతివి
|| పాడెదము ||

7. పరాక్రమ శాలివై ప్రభు సజీవుడవై లేచితివి
మరణమును జయించితివి విజయుండవై
|| పాడెదము ||