ప్రవిమలుడా పావనుడా – స్తుతిస్తోత్రము నీకే

“దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” రోమా Romans 5:5

పల్లవి : ప్రవిమలుడా పావనుడా – స్తుతిస్తోత్రము నీకే
పరమునుండి ప్రవహించె – మాపై కృప వెంబడి కృపలు

1. నీ మందిర సమృద్ధివలన – తృప్తిపరచు చున్నావుగా
ఆనంద ప్రవాహ జలమును – మాకు త్రాగనిచ్చితివి
కొనియాడెదము నీ కృపకై ఆనందించుచు పాడెదము
|| ప్రవిమలుడా ||

2. దేవుని సంపూర్ణతలో మమ్ము – పరిశుద్ధులుగా జేసియున్నావు
జ్ఞానమునకు మించిన ప్రేమ మాలో బయలు పరచితివి
కృతజ్ఞతలు చెల్లించుచు పూజించెదము నిన్నెప్పుడు
|| ప్రవిమలుడా ||

3. దైవత్వము నిండియుండెనుగా క్రీస్తు యేసు ప్రభువునందు
ఆయనయందు సంపూర్ణులుగా మమ్ము జేసియున్నావు
సాగిలపడుచు నీ కృపకై ఆరాధింతుము నిన్నిలలో
|| ప్రవిమలుడా ||

4. నిర్ధోషులుగా నిరపరాధులుగా నీ రక్తముతో మము జేసితివి
సర్వసంపూత్ణత మాకిచ్చి సిలువలో సంధిజేసితివి
నిత్యము నిన్ను స్తుతించి ఘనపరచెదము నిన్నిలలో
|| ప్రవిమలుడా ||

5. కృపా సత్యసంపూర్ణుడవై మామధ్యలో నివసించితివి
లోకమునందు నమ్మబడితివి అద్వితీయ తనయుడవై
నిరతము నిన్ను కీర్తించి సమాజములో పాడెదము
|| ప్రవిమలుడా ||

నే పాడెద నిత్యము పాడెద

“అతడు యధార్థ హృదయుడై … నేర్పరియై వారిని నడిపించెను” కీర్తన Psalm 78:72

పల్లవి : నే పాడెద నిత్యము పాడెద – ప్రభువా నీకు స్తుతి పాడెదన్

1. మంచి కాపరి నీవైతివి గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి
పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నా కొసగితివి
హర్షించి ప్రభు పాడెదను
|| నే పాడెద ||

2. గొప్ప కాపరివి తోడై యున్నావు ప్రతి అవసరతల్ తీర్చుచున్నావు
నా ప్రాణమునకు సేదనుదీర్చి మరణలోయలలో తోడై యుందువు
యాత్రలో పాడుచు వెళ్ళెదను
|| నే పాడెద ||

3. ఆత్మల కాపరి సత్యవంతుడవు గొర్రెలన్నిటికి కాపరి నీవై
ద్వేషించెదవు దొంగకాపరులన్ నీగొర్రెలు నీస్వరమును వినును
హృదయపూర్తిగ పాడెదను
|| నే పాడెద ||

4. ప్రధానకాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు
మహిమకిరీటము నాకొసగెదవు పరమనగరమందు నన్నుంచెదవు
ఎలుగెత్తి ప్రభు పాడెదను
|| నే పాడెద ||