పూజనీయుడేసు ప్రభు

“ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు” 1 పేతురు Peter 2:23

పల్లవి : పూజనీయుడేసుప్రభు పలునిందల నొందితివా నాకై
పూజనీయుడేసు ప్రభు

1. నీ స్వకీయులే నిందించిన
నీన్నంగీకరించక పోయిన
ఎన్నో బాధ లొందితివా నాకై
సన్నుతింతును నీ ప్రేమకై
|| పూజనీయుడేసు ||

2. సత్యము మార్గము మరి జీవమై
నిత్యజీవమియ్యను వచ్చితివి
వంచకుడవ నిన్ను నిందించిర
ఓ దయామయ నజరేయుడ
|| పూజనీయుడేసు ||

3. యూదా గోత్రపు ఓ సింహమా
ఆద్యంతరహిత దైవమా
అధములు నిన్ను సమరయు డనిర
నాథుడా నిన్ను బహు దూషించిరా
|| పూజనీయుడేసు ||

4. దూషించు శత్రుసమూహములన్
దీవించి ఎంతో క్షమించితివి
దూషకుడవని నిన్ను దూషించిర
దోషరహితుడా నా యేసు ప్రభు
|| పూజనీయుడేసు ||

5. దయ్యములు నినుజూచి వణికినను
దయ్యముల పారద్రోలినను
దయ్యములు పట్టిన వాడనిర
ఓ దయామయ నా యేసు ప్రభు
|| పూజనీయుడేసు ||

6. మధురం నీ నామం అతి మధురం
మధుర గీతముతో నిన్నా రాధింతును
వధియించబడితివ యీ పాపికై
వందితా ప్రభు నిన్ను పూజింతును
|| పూజనీయుడేసు ||

అందరము ప్రభు నిన్ను కొనియాడెదము

“ప్రభువును స్తుతించుడి” ప్రకటన Revelation 19:1

పల్లవి : అందరము ప్రభు నిన్ను కొనియాడెదము
మహాత్ముండవు పరిశుద్ధుడవు
బలియైతివి లోకమును రక్షించుటకు

1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయో
సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది
సర్వలోకము నీదు వశమందున్నది
|| అందరము ||

2. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా
అద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవు
శత్రువులను అణచునట్టి విజయశాలివి
|| అందరము ||

3. బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివి
నీదు మార్గములు యెంతో అగమ్యంబులు
కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు
|| అందరము ||

4. కృపాళుండవైన యేసు దయగల దేవా
దయాకనికరములు గల దీర్ఘశాంతుడవు
వేల వేల తరములలో కృపను జూపెదవు
|| అందరము ||

5. క్షమించెదవు మానవుల పాపములెల్ల
విరోధులకు ప్రేమ జూపు దయామయుడవు
పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా
|| అందరము ||