యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు

“ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేసిరి.” ప్రకటన Revelation 4:10

యేసు ప్రభూ గద్దెపైనున్న నీకు
మా స్తుతులను చెల్లించెదము
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండ వీవంచు కీర్తింతుము

పల్లవి : పాత్రుండవీవే పాత్రుండవీవే
పాత్రుండవీవే మాప్రభు నీవే
నీ సన్నిధియందు నిన్నారాధించి
పాత్రుండవీవంచు కీర్తింతుము

1. దేవుడౌ నీవు నరరూపమెత్తి
దూతలకన్న తగ్గింపబడి
స్త్రీ సంతానమౌ నీవు మరణించి
సర్పము తల నణగ ద్రొక్కితివి
|| పాత్రుండవీవే ||

2. నీ సృష్టియే సిల్వయొద్దకు నిన్ను
నడ్పి సిల్వన్ మేకులతో కొట్టిరి
దైవ మానవులచే వీడబడి
శాప నష్ట మనుభవించితివి
|| పాత్రుండవీవే ||

3. మహిమతో మరణమును గెల్చి
గొప్ప విజయము పొందితివి
చావు సమాధులపై విజయుండా
నిన్ను స్తుతింపక నెట్టులుందును
|| పాత్రుండవీవే ||

సర్వముపై యేసు రాజ్యమేలున్

“సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.” ఎఫెసీయులకు Ephesians 1:22

సర్వముపై యేసు రాజ్యమేలున్
పాపి మిత్రుడు గొఱ్ఱెపిల్లకు
మన మొరవిన కిరీటము
నిచ్చి హెచ్చించె దేవుడాయనన్

పల్లవి : సర్వముపై సర్వముపై – సిల్వవేయబడినట్టివాడే
పాదములబడి పూజింతుము – సర్వముపై హెచ్చించె దేవుడు

1. తుఫాను భయంకరాలచే
కొట్టునపుడు మొఱ పెట్టగా
యేసును వేడగా నా చేతితో
పట్టి శిలలపై నడ్పించును
|| సర్వముపై ||

2. పట్టణము లతిగొప్పవైనన్
అడ్డములు బలమైనపుడున్
నిర్భయముగ సాగుచుందుము
సర్వముపై నున్న వాని ద్వారా
|| సర్వముపై ||

3. ధృవము నుండి ధృవం వరకు
యుగములనుండి శాశ్వతముగ
సర్వముపై ననుభవింతుము
వీరులై యేసు వెంట సాగుచు
|| సర్వముపై ||