సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు

1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మణచి వేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ||

2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
పాప జగతి పునాదులే కదలిపోయెను
లోక మంత చీకటి ఆవరించెను
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||

అనాదిలో నియమించబడిన

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె

మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై

శరీరధారి యాయెను సజీవయాగమాయెను

మరణమును గెలిచి లేచెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”