నాలోన అణువణువున నీవని

నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను

1. అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి
అమృతజల్లులు కురిపించే – అనందగానాలు పాడుచునే
కలిగియుందునే – నీ దైవత్వమే !! నాలోన !!

2. ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే
ఈ పరిచర్యలో నేను – వాగ్దానఫలములు పొందుకుని
ధరించుకుందునే – నీ దీనత్వమే !! నాలోన !!

3. వివేక హృదయము – అనుగ్రహించి
విజయపధములో నడిపించెదవు
వినయభయభక్తితో నేను – నిశ్చల రాజ్యము పొందుటకు
స్మరించుకుందునే – నీ ఆమరత్వమే !! నాలోన !!

ఆత్మపరిశుద్దాత్ముడా

ఆత్మపరిశుద్దాత్ముడా – నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా – నితో నడించుము
నా ప్రాణ ఆత్మ శరీరమును
యేసయ్య రాకకై సిద్దపరచుము

1. నిర్జీవమైన నా జీవితములో – నిరీక్షణ కలిగించితివి
లెక్కింపశక్యముగాని – సైన్యములో నను నిలిపితివి
నాలో నివసించుము – నీతో నడిపించుము

2. పెంతుకొస్తు దినమందున – బలముగ దిగివచ్చితివి
అన్యభాషలు మాట్లాదుతకు – వాక్ శక్తి నొసగితివి
నాలో నివసించుము – నీతో నడిపించుము

3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు – నా యందు ఏర్పరుచుటకే
ఆరొగ్యకరమైన ఉపదేసములో – కృపతో స్దిరపరచితివి
నాలో నివసించుము – నీతో నడిపించుము