పల్లవి : సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్ధ్యమును - కొనియాడబడినది నీ దివ్య తేజం - నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్య (2) 1.ప్రేమతో ప్రాణమును అర్పించినావు - శ్రమల సంకెళ్ళయినా శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు - జగతిని జయించిన జయశీలుడా (2) || సర్వయుగములలో || 2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు- శృంగ ధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవు (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను - మరణము గెలిచినా బహు ధీరుడ (2) || సర్వయుగములలో || 3.కృపాలతో రాజ్యమును స్థిరపరచు నీవు - బహూత్తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో - శత్రువు నణచినా బహు శూరుడా (2) || సర్వయుగములలో ||
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
సర్వలోక నివాసులారా
-
- సర్వలోక నివాసులారా – సర్వాధికారిని కీర్తించెదము రారండి
-
- యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
-
- మన సంతోషము – పరిపూర్ణము చేయు
-
- శాంతి సదనములో నివసింతుము
-
కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నవి విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము|| సర్వలోక ||
-
ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నవి పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము|| సర్వలోక ||
-
సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి మృదువైన అక్షయ అలంకారముతో సద్భక్తితో సాగిపోదము