“Nikosamu bratikina dasulanu unnatamuga heccinncina naa Yesayya”

Pallavi:

నీకోసము బ్రతికిన దాసులను ఉన్నతముగా హెచ్చించిన నా యేసయ్య 

వారి యొక్క విశ్వాస మును ఘనపరిచిన నా యేసయ్య 

యేసయ్య నీకే నా వందనము.. యేసయ్య నీకే నా వందనము

[Verse 1] అబ్రాహాము వలె విశ్వాస పరీక్షలు ఎన్నో.. నీ సేవకుల బ్రతుకు దినములలో 

పౌలు వలె సత్య స్థాపనకై పోరాటములు ఎన్నో.. నీ సేవకుల బ్రతుకు దినములలో

 అన్నింటిలో యెహోవా నా కాపరిగా ఉండి నడిపించిన నా యేసయ్య 

యేసయ్య నీకే నా వందనము.. యేసయ్య నీకే నా వందనము

[Verse 2] దావీదు వలె స్వజనుల నుండి పోరాటములు ఎన్నో.. నీ సాక్షుల జీవితములో 

స్తెఫాను వలె రాళ్లు రువ్విన పరిస్థితులు ఎన్నో.. నీ సాక్షుల జీవితములో అన్నింటిలో ఎబినేజరుగా ఉండి నడిపించిన నా యేసయ్య 

యేసయ్య నీకే నా వందనము.. యేసయ్య నీకే నా వందనము


Verse3: క్రీస్తు వలె ప్రాణము త్యాగము చేయుటకు వెనుకాడని సాక్షుల సమూహములో 

నీ ప్రేమను చాటగా సిలువను మోయుచు సాగుచున్న నీ బిడ్డల మార్గములో అన్నింటిలో ఇమ్మానుయేలుగా తోడై ఉండి బలపరచిన నా యేసయ్య 

యేసయ్య నీకే నా వందనము.. యేసయ్య నీకే నా వందనము

Last words  : మరణము వరకు నమ్మకముగా – నీ సాక్షిగా నేనుండాలి 

నా తుది శ్వాస విడిచిన క్షణం – నీ రాజ్యములో నేను చేరాలి 

నీకే వందనము.. యేసయ్య నీకే వందనము… హల్లెలూయ.. ఆమెన్..

Recent Devotions

గౌరవింపజేయును | Gowravimpajeyunu

పల్లవి:
యేసుని రూపం నీలో తెలియును
క్రీస్తుని జీవం నిన్ను నిలుపును
నా ప్రాణమా నీకు కలతందుకే
నీ శ్రమను ప్రభు చూచుచుండెనే

​కోరస్:
గొప్ప జనముగా నిన్ను చేయు
ఘనమగు పేరు నీకిచ్చు
తగిన కాలమున శీఘ్రముగా
ఆయనే ఇది జరిగించును

​చరణం 1:
కొరగాని రాయన్న వారి ఎదుటనే
మూలకు తలరాయిగా నిన్ను చేయునే
సకల జాతులు నిన్ను కోరును
యేసుని మహిమతో నిండెదవు
ఈ వత్సరమే యేసు నీలో వెలువగును

​చరణం 2:
విరిగిన నీ బ్రతుకు బాగు చేయును
ఘనమగు దినములు నియమించును
పడిపోయిన చోటున నీదు తల ఎత్తును
రాజవిందులో నీకు స్థానమిచ్చును
ఈ వత్సరమే అధికముగా ఖ్యాతినిచ్చును

“మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి!”