యేసయ్యా నీవే నాకని

Yesayya Neeve Naakani – యేసయ్యా నీవే నాకని

యేసయ్యా నీవే నాకని– వేరెవ్వరు నాకులేరని  ||2||

వేనోళ్ళకొనియాడిన– నాఆశలుతీరవే

కృపవెంబడికృపనుపొందుచూ

కృపలోజయగీతమేపాడుచూ

కృపలోజయగీతమేపాడుచూ  ||యేసయ్యా||


1.ఉన్నతఉపదేశమందున

సత్తువగలసంఘమందున ||2||

కంచెగలతోటలోనా– నన్నుస్థిరపరిచినందున ||2||    ||కృప||


2.సృష్టికర్తవునీవేనని

దైవికస్వస్థతనీలోనని ||2||

నాజనులుఇకఎన్నడు– సిగ్గుపడరంటివే ||2||    ||కృప||

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు
యెడబాయని నీ కృపలో

నశించి పోయే నన్ను నీవు
ఎంతో ప్రేమతో ఆదరించి 2
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ 2
రక్షణ భాగ్యము నొసగితివే

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2
యెడబాయని నీ కృపలో

నా భారములు నీవే భరించి
నా నీడగా నాకు తోడైయుండి 2
చెదరిన నా హృది బాధలన్నిటిని 2
నాట్యముగానే మార్చితివే

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2
యెడబాయని నీ కృపలో

అనుదినము నీ ఆత్మలోనే
ఆనంద మొసగిన నా దేవా 2
ఆహా రక్షక నిన్ను స్తుతించెద 2
ఆనంద గీతము నేపాడి

నీకేమి చెల్లింతు నా ప్రాణమా యేసు 2
యెడబాయని నీ కృపలో

స్తుతి గానమా నా యేసయ్యా

Stuthi Gaanama Na yesayya | స్తుతి గానమా నా యేసయ్యా

స్తుతి గానమా - నా యేసయ్యా 
నీ త్యాగమే - నా ధ్యానము 
నీ కోసమే - నా శేష జీవితం          || స్తుతి ||

1.నా హీన స్థితి చూచి 
నా రక్షణ శృంగమై 
నా సన్నిధి నీ తోడని 
నను ధైర్యపరచినా … నా నజరేయుడా  || స్తుతి || 

2.నీ కృప పొందుటకు 
ఏ యోగ్యత లేకున్నను 
నీ నామ ఘనతకే 
నా శాశ్వత నీ కృపతో ...
నన్ను నింపితివా  || స్తుతి ||

అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

పల్లవి:
అబ్రహాము దేవుడవు – ఇస్సాకు దేవుడవు

యాకోబు దేవుడవు – నాకు చాలిన దేవుడవు

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)

1.
అబ్రహాము విశ్వాసముతొ – స్వ దేశము విడచెను

పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)

అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)
…అబ్రహాము…

2.
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను

వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)

ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)
…అబ్రహాము…

3.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను

యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X)

యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)

యేసయ్యా నా యేసయ్యా – యేసయ్యా నా యేసయ్యా (2X)

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము

స్తుతి స్తోత్రములు చెల్లింతుము-స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా

1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |

2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |