యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం

యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం
యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం
క్రీస్తు వారలం – పరలోక వాసులం
వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం
ముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగము
ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము
మెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదం
పరలోకముకై మేము సిద్ధపడెదము
జయము జయము హోసన్నా జయము జయమని
నోరారా రారాజును కీర్తించెదం
జయము జయము హోసన్నా జయము జయమని
మనసారా మహా రాజును సేవించెదం        ||యుద్ధ||

గర్జించే అపవాది ఎదురు నిలచినా
ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా
శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా
పాపములో మమ్మును పడద్రోయ జూచినా
విశ్వాసమే ఆయుధం – ప్రార్ధనే మా బలం
వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం
సిలువలో సాతానుని – తలను చితక త్రొక్కిన
మా రాజు యేసులోనే జయము పొందెదం       ||జయము||

జయం జయం.. నోరారా రారాజును కీర్తించి
జయం జయం.. మనసారా మహా రాజును సేవించి
జయం జయం.. నోరారా రారాజును కీర్తించి
జయం జయం.. మనసారా మహా రాజును సేవించెదం

ఇహ లోక ఆశలెన్నో మోసగించినా
క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా
శ్రమలు అవమానములే కృంగదీసినా
బలహీనతలే మమ్మును భంగ పరచినా
బ్రతుకుట ప్రభు కోసమే – చావైనా లాభమే
పందెమందు ఓపికతో పోరాడెదం
నిత్య జీవమివ్వను – మరణమును గెలిచిన
మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం       ||జయము||

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

ఆశ్చర్యకరుడా నీదు కృపా – అనుదినం అనుభవించెద

ఆది అంతము లేనిది – నీ కృప శాశ్వతమైనది

1. ప్రేమతో పిలిచి నీతితో నింపి – రక్షించినది కృపయే -2

జయ జీవితమును చేసెదను – అమూల్యమైన కృపతో -2 ॥ ఆశ్చర్య ॥

2. ఆకాశము కంటె ఉన్నతమైనది – నీ దివ్యమైన కృపయే -2

పలు మార్గములలో స్థిరపరచినది – నవనూతన కృపయే -2 ॥ ఆశ్చర్య ॥

3. యేసయ్యా – నీ కృపాతిశయము నిత్యము కీర్తించెదను -2

నీ కృపను గూర్చి పాడెదను – ఆత్మానందముతో -2 ॥ ఆశ్చర్య ॥

ఎవరున్నారు ఈ లోకంలో

Yevarunnaru Ee lokamlo | ఎవరున్నారు ఈ లోకంలో

ఎవరున్నారు ఈ లోకంలో 
ఎవరున్నారు నా యాత్రలో 
నీవే యేసయ్యా ఆనందము 
నీవే యేసయ్యా ఆశ్రయము 

ఎన్నిక లేని నన్ను నీవు - ఎన్నిక చేసితివే 
ఏదరి కానక తిరిగిన నన్ను - నీదరి చేర్చితివే 
నీ దరి చేర్చితివే                                            || ఎవరు ||  

శోధనలో వేదనలో -  కుమిలి నేనుండగా 
నాదరి చేరి నన్నాదరించి - నన్నిల బ్రోచితివే 
నన్నిల బ్రోచితివే                                           || ఎవరు ||

ఊహలు నాదు ఊటలు

ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి (2)
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2)      ||ఊహలు||

నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా (2)
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు (2)      ||ఊహలు||

శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా (2)
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు (2)      ||ఊహలు||

ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే (2)
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే (2)      ||ఊహలు||

యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా

Yesayya naa nireekshana | యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా

యేసయ్యా … 
నా నిరీక్షణ ఆధారమా 
నా నిరీక్షణా ఆధారమా 

ఈ ఒంటరి పయనంలో 
నా జీవితానికి ఆశ్రయ దుర్గము 
నీవే నాలోనే నీ వుండుము 
నీ లోనే నను దాయుము || యేసయ్యా ||

షాలేము రాజా నీదు నామం 
పోయబడిన పరిమళ తైలం 
నీవే నా ప్రాణము 
సీయోనే నా ధ్యానము || యేసయ్యా ||