పోరాటం ఆత్మీయ పోరాటం

పోరాటం ఆత్మీయ పోరాటం (2)
చివరి శ్వాస వరకు – ఈ పోరాటం ఆగదు
సాగిపోవుచున్నాను
సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి (2)

నా యేసుతో కలిసి పోరాడుచున్నాను
అపజయమే ఎరుగని జయశీలుడాయన (2)
నా యేసు కొరకే సమర్పించుకున్నాను (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

నా యేసు వెళ్ళిన మార్గము లేనని
అవమానములైనా ఆవేదనలైనా (2)
నా యేసు కృపనుండి దూరపరచలేవని (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

ఆదియు అంతము లేనివాడు నా యేసు
ఆసీనుడయ్యాడు సింహాసనమందు (2)
ఆ సింహాసనం నా గమ్యస్థానం (2)
ఆగిపోను నేను సాగిపోవుచున్నాను          ||పోరాటం||

కృపానిధి నీవే ప్రభు

Krupaanidhi Neeve Prabhu – కృపానిధి నీవే ప్రభు

కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు ||2||
నీ కృపలో నన్ను నిలుపుము ||2||
నీ కృపతోనే నను నింపుము ||2|| ||కృపా||

1. నీ కృప ఎంతో మహోన్నతము
ఆకాశము కంటే ఎత్తైయినది ||2||
నీ సత్యం అత్యున్నతము
మేఘములంత ఎత్తున్నది ||2|| ||కృపా||

2. నీ కృప జీవముకంటే ఉత్తమము
నీ కృప లేనిదే బ్రతుకలెను ||2||
నీ కృపా బాహుళ్యమే నను
నీలో నివసింప చేసినది ||2||||కృపా||

3. నీ కృపలను నిత్యము తలచి
నీ సత్యములో జీవింతును ||2||
నీ కృపాతిశయములనే
నిత్యము నేను కీర్తింతును ||2|| ||కృపా||

4. ఈ లోకము ఆశాశ్వతము
నీదు కృపయే నిరంతరము ||2||
లోకమంతా దూషించినా
నీ కృప నాకంటే చాలు ||2|| ||కృపా||

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
మరణపుముల్లును విరిచినవాడా
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు
1. నీ రక్తమును నా రక్షణకై
బలియాగముగా అర్పించినావు
నీ గాయములద్వారా స్వస్థతనొంది
అనందించెద నీలో నేను
||మహిమ స్వరూపుడా||
2.విరిగిన మనస్సు నలిగినా హృదయం
నీ కిష్టమైన బలియాగముగా
నీ చేతితోనే విరిచిన రోట్టెనై
ఆహారమౌదును అనేకులకు
||మహిమ స్వరూపుడా||
3. పరిశుద్ధత్మ ఫలముపొంది
పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
సీయోను రాజా నీ ముఖము చూడ
ఆశతో నేను వేచియున్నాను
||మహిమ స్వరూపుడా||

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని

నా వేదనలో వెదకితిని శ్రీయేసుని పాదాలను
నా మనస్సులో కోరితిని నీ రూపమునే దీనుడనై

1. వేకు జాములో విలపించితిని నా పాపములో వ్యసనములో
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)

2. నీ హస్తములో నిదురింపజేయుమా నీ ప్రేమలో లాలించుమా
ఓదార్చుము విసుగొందక నీ కృపలో నా ప్రభువా (2)

ఆనందం యేసుతో ఆనందం

Aanandam yesutho aanandamu – ఆనందం యేసుతో ఆనందం

ఆనందం యేసుతో ఆనందం

జయగంభీర ధ్వనితో పాడెదను

జయరాజాధిరాజుతో సాగెదను

1. నా ప్రాణమునకు సేదదీర్చి

తన నామము బట్టి నీటి మార్గమున నన్ను నడిపించెను

 అపాయమునకు నేను భయపడకుందును

2. నా ప్రభుని కృప చూచిన

నాటినుండి నన్ను నేనే మరచిపోతినే

నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచెదనా

3. సిలువను యేసు సహించెను

తన యెదుట ఉంచబడిన జ్యేష్ఠుల సంఘముకై

అవమానము నొందె – నాకై మరణము గెలిచె