పల్లవి: ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం పాపములన్నియు కడుగుచున్నది పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది 1. దుర్ణీతి నుండి విడుదలచేసి నీతిమార్గాన నిను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది || 2. దురభిమానాలు దూరముచేసి యథార్థ జీవితం నీకనుగ్రహించును యేసురక్తము నిర్దోషమైనది నీవు ఆయన ఎదుటే నిలిచెదవు || ప్రవహించుచున్నది || 3. జీవజలముల నది తీరమున సకలప్రాణులు బ్రతుకుచున్నవి యేసురక్తము జీవింపజేయును నీవు ఆయన వారసత్వము పొందెదవు || ప్రవహించుచున్నది ||
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే
1. నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో నన్ను నడిపించెనే ||2||
నా నిత్యరక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య ||2|| || నిత్యా ||
2. నా అభిషిక్తుడా నీ కృపావరములు
సర్వోత్తమమైన మార్గము చూపెనే ||2||
మర్మములన్నియు బయలుపరుచువాడా
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య ||2|| || నిత్యా ||