విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైయుండుట అసాధ్యము విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు .......... హానోకు తన మరణము చూడకుండ పరమునకు ఎత్తబడి పోయెనుగా ఎత్తబడక మునుపే దేవునికి ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || నోవహు దైవభయము గలవాడై దేవునిచే హెచ్చరించబడిన వాడై ఇంటివారి రక్షణకై ఓడను కట్టి నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా || మోషే దేవుని బహుమానము కొరకై ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి శ్రమలనుభవించుటయే భాగ్యమని స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను || విశ్వా || వీరందరు సాక్ష్యము పొందియున్నను మనము లేకుండా సంపూర్ణులు కారు అతి పరిశుద్ధమైన విశ్వాసముతో మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వా ||
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
మనసెరిగిన యేసయ్యా
మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు (2)
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు (2) ||మనసెరిగిన||
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||
వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2) ||మనసెరిగిన||
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2) ||మనసెరిగిన||