సీయోనులో స్తిరమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు సూర్యుడు లేని - చంద్రుడు లేని చీకటి రాత్రులు - లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో || కడలిలేని - కడగండ్లులేని కల్లోల స్థితిగతులు - దరికే రాని సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా || సీయోనులో || కలతలు లేని - కన్నీరు లేని ఆకలి దప్పులు - అసలే లేని నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా || సీయోనులో || సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము సౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే || సీయోనులో ||
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||
అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన||
అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన||
విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||