సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు

సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
నరులకై విలపించు నజరేయుడు
ఆ దేవుడు చిందించిన రుధిర దారలే
ఈ జగతిని విమోచించు జీవధారలు

1.నిరపరాధి మౌనభుని దీనుడాయెను
మాతృమూర్తి వేదననే ఓదార్చెను
అపవాది అహంకార మణచి వేసెను
పగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ||

2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెను
పాప జగతి పునాదులే కదలిపోయెను
లోక మంత చీకటి ఆవరించెను
శ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||

అనాదిలో నియమించబడిన

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె

మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై

శరీరధారి యాయెను సజీవయాగమాయెను

మరణమును గెలిచి లేచెను

అదియే అనాది సంకల్పమాయెను

॥ అనాది ॥

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నీతి న్యాయములు జరిగించు నా యేసయ్యా

నిత్య జీవార్థమైనవి నీ శాసనములు (2)

వృద్ధి చేసితివి పరిశుద్ధ జనముగా

నీ ప్రియమైన స్వాస్థ్యమును

రద్దు చేసితివి ప్రతివాది తంత్రములను

నీ రాజ్య దండముతో         ||నీతి||

 

ప్రతి వాగ్ధానము నా కొరకేనని

ప్రతి స్థలమందు – నా తోడై కాపాడుచున్నావు నీవు (2)

నిత్యమైన కృపతో నను బలపరచి

ఘనతను దీర్గాయువును దయచేయువాడవు (2)      ||నీతి||

 

పరిమళ వాసనగ నేనుండుటకు

పరిశుద్ధ తైలముతో – నన్నభిషేకించి యున్నావు నీవు (2)

ప్రగతి పథములో నను నడిపించి

ప్రఖ్యాతిని మంచి పేరును కలిగించువాడవు (2)      ||నీతి||

 

నిత్య సీయోనులో నీతో నిలుచుటకు

నిత్య నిబంధనను – నాతో స్థిరపరచుచున్నావు నీవు (2)

మహిమ కలిగిన పాత్రగ ఉండుటకు

ప్రజ్ఞ వివేకములతో నను నింపువాడవు (2)      ||నీతి||

 

 

జీవించుచున్నది నేను కాదు

జీవించుచున్నది నేను కాదు
క్రీస్తుతో నేను సిలువవేయబడినాను
క్రిస్తే నాలో జీవించుచున్నడు
1 నేను నా సొత్తు కానేకాను !!2!!
క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు !!2!!
యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది !!2!!

2. యుద్ధము నాది కానేకాదు !!2!!
యుద్ధము యేసయ్యదే నా పక్షమున
జయమసలే నాది కానేకాదు !!2!!
యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు !!2!!

3. లోకము నాది కానేకాదు
యాత్రికుడను పరదేశిని
నాకు నివాసము లేనేలేదు !!2!!
యేసయ్య నివాసము నాకిచ్చినాడు !!2!!

4. జీవించుచున్నది నేను కాదు
క్రిస్తే నాలో జీవించుచున్నడు !!4!!
జీవించుచున్నది నేను కానే….కాను….

వేల్పులలో బహుఘనుడా

వేల్పులలో బహుఘనుడా యేసయ్యా
నిను సేవించువారిని ఘనపరతువు (2)
నిను ప్రేమించువారికి సమస్తము
సమకూర్చి జరిగింతువు. . . .
నీయందు భయభక్తి గల వారికీ
శాశ్వత కృపనిచ్చేదవు. . . .|| వేల్పులలో ||

సుందరుడైన యోసేపును అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు ఫలించేడి కొమ్మగ చేసావు (2)
మెరుగుపెట్టి నను దాచావు నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు తగిన సమయములో (2)|| వేల్పులలో ||

ఉత్తముడైన దావీదును ఇరుకులేని విశాల స్ధలములో
ఉన్నత కృపతో నింపావు ఉహించని స్దితిలో నిలిపావు (2)
విలువపెట్టి నను కొన్నావు నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుటకొరకు మహిమ రాజ్యములో (2)|| వేల్పులలో ||

పామరుడైన సీమోనును కొలతలేని అత్మాభిషేకముతో
అజ్ఞానము తొలగించావు విజ్ఞాన సంపదనిచ్చావు (2)
పేరుపెట్టి నను పిలిచావు నిను పోలినడుచుటకు
చెప్పశక్యముకాని ప్రహర్షముతో నిను స్తుతించేదను (2)