నా యేసయ్యా నా స్తుతియాగము

నా యేసయ్యా నా స్తుతియాగము
నైవేద్యమునై ధూపము వోలె
నీ సన్నిధానము చేరును నిత్యము
చేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)

ఆత్మతోను మనసుతోను
నేను చేయు విన్నపములు (2)
ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై
విజ్ఞాపన చేయుచున్నావా (2)
విజ్ఞాపన చేయుచున్నావా       ||నా యేసయ్యా||

ప్రార్థన చేసి యాచించగానే
నీ బాహు బలము చూపించినావు (2)
మరణపు ముల్లును విరిచితివా నాకై
మరణ భయము తొలగించితివా (2)
మరణ భయము తొలగించితివా         ||నా యేసయ్యా||

మెలకువ కలిగి ప్రార్థన చేసిన
శోధనలన్నియు తప్పించెదవు (2)
నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై
రారాజుగా దిగి వచ్చెదవు (2)
రారాజుగా దిగి వచ్చెదవు        ||నా యేసయ్యా||

నా జీవిత భాగస్వామివి నీవు

నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2)

నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి (2) ||నా జీవిత||

నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి (2) ||నా జీవిత||

నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు (2) ||నా జీవిత||