నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము

నీ ముఖము మనోహరము – నీ స్వరము మాధుర్యము
నీ పాదాలు అపరంజి మయము
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా – మనగలనా నిను వీడి క్షణమైన

1. నీవే నాతోడువై నీవే నాజీవమై – నా హృదిలోన నిలిచిన జ్ణాపికవై
అణువణువున నీకృప నిక్షిప్తమై –
నను ఎన్నడు వీడని అనుబంధమై “యేసయ్య”

2. నీవే నా శైలమై నీవే నాశృంగమై – నా విజయానికే నీవు భుజబలమై
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై –
నను వెనుదీయనీయక వెన్ను తట్టినావు “యేసయ్య”

3. నీవే వెలుగువై నీవే ఆలయమై – నా నిత్యత్వమునకు ఆద్యంతమై
అమరలోకాన శుద్ధులతో పరిచయమై –
నను మైమరచి నేనేమి చేసేదనో “యేసయ్య”

కలువరిగిరిలో సిలువధారియై

కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా ||2||

1. అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా ||2||
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా ||2||            ||కలువరిగిరిలో||

2. దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను ||2||
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా ||2||                ||కలువరిగిరిలో||