సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా 

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా

జీవింతును నిత్యము నీ నీడలో

ఆస్వాదింతును నీ మాటల మకరందము

1. యేసయ్య నీతో జీవించగానే

నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే

నాట్యమాడేను నా అంతరంగము

ఇది రక్షణానంద భాగ్యమే   ||సుగుణాల||

2. యేసయ్య నిన్ను వెన్నంటగానే

ఆజ్ఞల మార్గము కనిపించెనే

నీవు నన్ను నడిపించాగలవు

నేను నడవవలసిన త్రోవలో   ||సుగుణాల||

3. యేసయ్య నీ కృప తలంచగానే

నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే

నీవు నాకిచ్చే మహిమ ఎదుట

ఇవి ఎన్నతగినవి కావే  ||సుగుణాల||

కృపలను తలంచుచు

కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2)       ||కృపలను||

కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు) (2)      ||కృపలను||

రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)       ||కృపలను||

సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)       ||కృపలను||

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్) (2)       ||కృపలను||