సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి సాగిపోదును నా యేసయ్యతో ఆత్మీయ బలమును పొందుకొని లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా దేవుని శక్తిసంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను|| సాగిపోదును || నూతనమైన మార్గములో తొట్రిల్లకుండ నడిపించును - నవ దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే|| సాగిపోదును || శ్రేష్ఠమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును - మరి దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.