నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట 1.నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య 2.నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య 3.సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య
Telugu Christian Songs
Listen to the best Telugu Christian Songs including worship, gospel, and devotional music. Explore dedication songs, prayer songs, and inspirational Telugu lyrics.
సాత్వీకుడా దీనులను
సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్య సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు సమృద్ది అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము 1.ఈర్షా ద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై శిలువపై ఒంటరయ్యావు అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నను తుది వరకు 2.కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనమూనింది గుండెలో నిండిన స్తుతి నొందే పూజ్యుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్య
అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానలే సప్త స్వరాలుగా నే పాడనా యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ నీ దివ్య సన్నిది చాలునయ
1.నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను సర్వ సత్యములలో నే నడచుటకు మరపురాని మనుజాశాలను విడిచి మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే 2.అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను వెనుదిరిగి చూడక పోరాడుటకు ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే 3.నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు అమూల్యమైన విశ్వాసము పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2 యేసయ్యా నీ సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే } 2 సిలువ సునాదమును నా శ్రమదినమున మధుర గీతికగా మదిలో వినిపించి } 2 సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2|| యేసయ్యా || నాతోడు నీడవై మరపురాని మహోప కార్యములు నాకై చేసి } 2 చీకటి దాచిన -వేకువగా మార్చి బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే } 2|| యేసయ్యా || నా మంచి కాపరివై మమతా సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి } 2 మారా దాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై } 2
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
యేసయ్య! నను కొరుకున్న నిజస్నేహితుడా
నీ యవ్వన రక్తము కార్చి – నీ ప్రేమ ప్రపంచంలో చేర్చినావు
నిను వీడి జీవింప నా తరమా
నిను ఆరాధింప నా బలమా !
మది మందిరాన కొలువైన నా వరమా !!
1. నా పూర్ణ హ్రుదయముతో నిన్ను వెదికితిని
నీ ఆజ్ఞలను విడిచి – నన్ను తిరుగనియ్యకుము
దైర్యమునిచ్చే – నీ వాక్యములో
నీ బలము పొంది – దుష్టుని ఎదిరింతును !! యేసయ్య !!
2. నా గురి గమ్యమైన నిను చేరిటకు
ఈ లోక నటనలు చూచి – నన్ను మురిసిపోనివ్వకు
పొందబోవు -బహుమానమునకై
నా సిలువను మోయుచు – నిను వెంబడించెదను !! యేసయ్య !!
3. నీ సంపూర్ణ సమర్పణయే – లోక కళ్యాణము
నీ శక్తి సంపన్నతలే – ఇల ముక్తిప్రసన్నతలు
మహనీయమైన – నీ పవిత్రతను
నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును !! యేసయ్య !!